Gold -Silver: బంగారం, వెండిలో ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేయోచ్చా... ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అలాంటి స్కీములు ఏమైనా ఉన్నాయా?

Gold -Silver Investment: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా ఆల్ టైం రికార్డును దాటి కిందికి రాలేదు. 10 గ్రాముల బంగారం ధర లక్షపైనే పలుకుతోంది. దీపావళికు ముందు తులం బంగారం ధర లక్షన్నర వరకు చేరుకుంది. అయితే ఈ ఏడాది పెరిగినట్లు ధరలు చరిత్రలో ఏనాడూ పెరగలేదు.

Written by - Bhoomi | Last Updated : Nov 8, 2025, 12:35 PM IST
Gold -Silver: బంగారం, వెండిలో ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేయోచ్చా... ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అలాంటి స్కీములు ఏమైనా ఉన్నాయా?

Add Zee News as a Preferred Source

Gold -Silver Investment: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా ఆల్ టైం రికార్డును దాటి కిందికి రాలేదు. 10 గ్రాముల బంగారం ధర లక్షపైనే పలుకుతోంది. దీపావళికు ముందు తులం బంగారం ధర లక్షన్నర వరకు చేరుకుంది. అయితే ఈ ఏడాది పెరిగినట్లు ధరలు చరిత్రలో ఏనాడూ పెరగలేదు. జనవరిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలు ఉంటే అక్టోబర్ 20వ తేదీ నాటికి రూ. 1.35లక్షలకు చేరుకుంది. కేవలం పది నెలల్లోనే పసిడి ధర రూ. 65వేలు పెరిగింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద పెరుగుదల అని చెప్పాలి. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు కూడా బంగారం ఇక కలగానే మిగిలిపోతుందా అనే ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ కొనుగోలు దారులు భయాందోళన వ్యక్తం చేస్తే ఇన్వెస్టర్లు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి పెట్టినవారు మంచి లాభాలను అందున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ వంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రాబడి వచ్చింది. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసివారికి కూడా తమ పెట్టుబడిపై 90శాతం వరకు లభాలు వచ్చాయని చెబుతున్నారు. ఇక నిపుణుల అంచనా ప్రకారం బంగారం ర్యాలీ ఇంకా కొంత కాలం కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు.

అయితే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే బంగారంలో ప్రతిరోజూ కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టవచ్చా. దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజూ చిన్న మొత్తాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా సాధ్యమనే చెప్పాలి.

ఎలా అంటే డిజిటల్ గోల్డ్ దీనికి సులభమైన మార్గం. ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు, బ్యాంకులు బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు కొత్త కొత్త మార్గాలను అందిస్తున్నాయి. అందులోనూ డిజిటల్ గోల్డ్ మొదటి స్థానంలో ఉంది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా మీరు రూ. 1 నుంచి కూడా బంగారాన్ని కొనవచ్చు. కొన్న బంగారం డిజిటల్ రూపంలో మీ వాలెట్ లోనే స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఫిజికల్ గా భద్రపరచాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని మీరు విక్రయించి మరింత లాభం పొందవచ్చు. ఈ విధంగా ప్రతిరోజూ చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే కొన్ని సంవత్సరాల్లోనే బంగారంతో భారీగా ఆస్తిని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.

Also Read: World's Largest Gold Reserves: చైనా కాదు, పాక్ కాదు.. బంగారాన్ని భూగర్భంలో పాతిపెట్టిన ఈ దేశం భారత్ పక్కనే ఉందని తెలుసా?

అయితే బంగారంలో మరో విశ్వసనీయ మార్గం ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ స్కీమ్. దీనిలో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ రూపంలో మొత్తాన్ని రోజువారీగా వారానికోసారి లేదా నెలకోసారి పెట్టుబడిపెట్టవచ్చు. ఈ స్కీములో మీరు లంప్ సమ్ లేదా రోజువారీ చెల్లింపు రూపంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి రోజూ 100 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో అది మంచి రాబడి పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుం మార్కెట్లో నిప్పాన్ ఇండియా గోల్డ్ సేవింగ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సికస్ గోల్డ్ ఈటీఎఫ్ వంటి స్కీములు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు బంగారం ధర పెరుగుదల ప్రయోజనాలను పొందడమే కాదు స్టాక్ మార్కెట్ ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ లో పాల్గొనే ఛాన్స్ కూడా పొందుతారు. ఇక ఇప్పుడున్న మార్కెట్ పరిస్ధితుల్లో బంగారం పెట్టుబడులకు స్థిరమైన భవిష్యత్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీగా చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే దీర్ఘకాలంలో మంచి రాబడి సాధ్యమవుతుంది. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఆధునిక స్కీములు దీనికి ఉత్తమ మార్గాలుగా మార్కెట్ నిపుణులు సైతం చెబుతున్నారు.

Also Read:  Gold: భూమిలో ఎన్ని టన్నుల బంగారం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని టన్నులు వెలికి తీశారు.. ఇంకా ఎంత ఉందో తెలుసా?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News