)
Gold And Silver Price Explanation: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ ఒకటి. కానీ ఇప్పుడు అది గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకటవ స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా ఉంది. కారణం దేశంలోని ద్రవ్యల్బోణం మూడు దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. వేతనాలు పెరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తోంది. ఈ తరుణంలో బంగారం పెట్టుబడుదారులను ద్రుష్టిని ఆకర్షిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిన్ తాజా నివేదిక ప్రకారం..జపాన్ లో బంగారంపై డిమాండ్ చరిత్రలో తొలిసారిగా పెరుగుతుందని వెల్లడించింది.
ఎందుకంటే జపాన్ వాసులు బంగారాన్ని ఎక్కువ ఇష్టపడరు. పెట్టుబడి పెట్టేందుకు పెట్టేందుకు సైతం ఆసక్తి చూపించరు. జపనీస్ కుటుంబాల ఆర్థిక ఆస్తులు మొత్తం 2,195 ట్రిలియన్ యెన్లుగా ఉన్నాయి. ఈ సంపదలో చిన్న భాగం కూడా బంగారానికి వెళ్తే భారీ మార్కెట్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో యెన్ పరంగా బంగారం రాబడి 40శాతంగా ఉంది. 2025లో ఇప్పటి వరకు 23శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇది బంగారం స్థిరమైన, నమ్మకమైన పెట్టుబడిగా నిలుస్తోందని సూచిస్తోంది.
జపాన్‌లో పెట్టుబడిదారులలో 73శాతం మంది స్టాక్స్, బాండ్లను ఇష్టపడుతుండగా, కేవలం 23శాతం మంది మాత్రమే బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే, అధిక నికర విలువ గల పెట్టుబడిదారుల (20 మిలియన్ యెన్ కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు) పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా దాదాపు 36శాతానికి చేరుకుంది. పెట్టుబడిదారులు సాధారణంగా తమ మొత్తం పెట్టుబడిలో 1శాతం నుంచి 10శాతం వరకు బంగారానికి కేటాయిస్తున్నారు.
జపాన్ పెట్టుబడిదారులు ఎక్కువగా పదవీ విరమణ భద్రత, దీర్ఘకాలిక సంపద వృద్ధి, అత్యవసర నిధులు వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ మూడు లక్ష్యాలకు బంగారం సహజంగానే అనుసంధానమై ఉంటుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం ఒక హెడ్జ్‌గా పనిచేస్తుంది. అంతేకాక, స్థిరత్వం, సంపద రక్షణలో బంగారం విశ్వసనీయమైన సాధనంగా నిలుస్తోంది.
బంగారం పెట్టుబడులపై అవగాహన లేకపోవడం, అధిక ధరలు, నిల్వ ఖర్చులు పెద్ద సవాళ్లుగా మారాయి. బంగారాన్ని ఎప్పుడూ కొననివారి దాదాపు 47శాతం మంది భవిష్యత్తులో కూడా కొనుగోలు చేయబోమని అంటున్నారు. 11శాతం పెట్టుబడిదారులకు బంగారంలో ఎలా ప్రారంభించాలో తెలియదు. అంతేకాక, చాలా మందికి బంగారం ఖరీదైన ఆస్తిగా అనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం పెట్టుబడుల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. చిన్న మొత్తాలుగా, తక్కువ ధర పెట్టుబడి ఎంపికలను అందించడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా సులభంగా కొనుగోలు చేసే అవకాశం కల్పించడం అవసరం. బంగారం స్థిరత్వం, సంపద రక్షణ, వైవిధ్యీకరణ వంటి ప్రయోజనాలను స్పష్టంగా ప్రజలకు చేరవేయడం వల్ల జపాన్‌లో బంగారం మార్కెట్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ జపాన్ కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.