Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 17వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!

Gold-Silver Price Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. నేడు నవంబర్ 17వ తేదీ సోమవారం బంగారం ధరలు చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,090 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,660 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,75,000 పలుకుతోంది. 

Written by - Bhoomi | Last Updated : Nov 17, 2025, 08:07 AM IST
Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 17వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే..!!

Gold-Silver Price Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. నేడు నవంబర్ 17వ తేదీ సోమవారం బంగారం ధరలు చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,090 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,660 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,75,000 పలుకుతోంది. 

Add Zee News as a Preferred Source

నేటి తేదీ నవంబర్ 17 సోమవారంకు సంబంధించిన బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,090, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,660 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరల విషయానికి వస్తే, ఒక కిలో వెండి ధర రూ. 1,75,000గా ఉంది. నిన్నటితో పోల్చితే బంగారం ధర కొద్దిగా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవడంతో, పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కొంతవరకు శుభవార్తగా మారింది. అయితే, ప్రస్తుతం బంగారం ధరలు అతి ఎక్కువగా ఉన్న రోజుల‌తో పోల్చితే సుమారు రూ. 10,000 తక్కువగానే ఉన్నప్పటికీ, ఇంకా పసిడి రికార్డు స్థాయికి సమీపముగానే ట్రేడ్ అవుతోంది. ఇటీవల బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో ఆభరణాల కొనుగోలు తగ్గినప్పటికీ, భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయంతో కొంతమంది కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో గమనిస్తే, డాలర్ బలపడితే బంగారం ధర తగ్గడం సాధారణ విషయం. డాలర్ విలువ పెరుగుతున్నప్పుడు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతాయి. దీనితో ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడులను తగ్గించి బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా బంగారంపై డిమాండ్ తగ్గి, ధరలు దిగివస్తాయి. ఇదే సమయంలో వెండి ధరలలో కూడా అస్తవ్యస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వెండి ధర ఒక దశలో రూ. 2 లక్షలకు చేరుకుంది. తరువాత కొంత తగ్గినా, ప్రస్తుతం ఉన్న డిమాండ్ పరిస్థితులను పరిశీలిస్తే, మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Fee Reumbursement: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉంటేనే.. ఫీజు రీయింబర్స్ మెంట్..!!   

పెట్టుబడి దృష్ట్యా బంగారం కొనుగోలు చేసే వారికి నిపుణులు ఇచ్చే సూచన ఏమిటంటే, ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లు వంటి భద్రమైన మార్గాలను ఎంచుకోవడం మంచిదని. ఇవి సురక్షితంగానే కాకుండా నిల్వ సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా మారతాయి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

Also Read:  Aadhaar Camps: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్..రేపటి నుంచే మొదలు. !!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News