Gold at Rs 1 Lakh: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మెడలో బంగారు తాడు పడాలంటే కన్నీటి చుక్కలా మారుతోంది. తలం బంగారం ధర లక్స రూపాయలు పలుకుతుండటంతో..సామాన్యుడికి అది అందని ద్రాక్షలా మారింది. ఒక్కప్పుడు తమ స్థాయికి తగ్గట్లుగా బంగారు ఆభరణాలు కొని కూతుళ్లకు బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. దీంతో చాలా మంది పాత బంగారం అమ్మి..తక్కువ మొత్తం కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ పెరిగిపోవడమే కాకుండా తక్కువ క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు.
ఇక గ్రామాల్లో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు..గౌరవానికి, సంపదకు చిహ్నం కూడా. పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలు ఒక ఆచారంగా భావిస్తారు. ఒకప్పుడు పెళ్లి అంటే ఇరు కుటుంబాలు తమ ఆర్థిర స్థోమతను చాటుకునేందుకు పోటీపడి బంగారం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు 30-40 గ్రాముల నుంచి సంపన్నులైతే కిలలో కొద్దీ బంగారం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ధరల్లో గ్రాము కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగారం ధరలు భారీగా పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు ఇప్పుడు 22 లేదా 24క్యారెట్ల బంగారానికి బదులుగా 14 లేదా 18 క్యారెట్ల బంగారు ఆభరణాల వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఇవి స్వచ్చత తక్కువగా కలిగి ఉండటం వల్ల ధర కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇవి ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఒకప్పుడు స్వచ్చమైన బంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుండేది. కానీ ఇప్పుడు ధరల పెరుగుదల కారణంగా ట్రెండ్ మారుతోంది. చాలా మంది తక్కువ క్యారెట్ల బంగారంతో చేసిన ఆకర్షణీయమైన డిజైన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇది బంగారం వ్యాపారులకు కూడా ఒక కొత్త మార్కెట్ ను అందించినట్లయ్యింది.
మొత్తానికి బంగారం ధరలు భారీగా పెరగడం సామాన్యులకు పెనుభారంగా మారాయి. పెళ్లిళ్లలో మెరిసే బంగారం ఇప్పుడు పేదవారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పాత బంగారం అమ్మితే పన్నుల భయం, కొనాలంటే ధరలు ఆకాశంలో ఉండటంతో చాలా మంది తక్కువ క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ ఇంకెలా మారుతుందో చూడాల్సిందే.
Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్-ఛైర్మన్ అవినాష్ గుప్తా మాట్లాడుతూ, జనవరి 1, 2025 నుండి బంగారం ధర 30% పెరిగిందని అన్నారు. ఏప్రిల్ 8, 2025న బంగారం ధర అత్యల్పంగా $2982 వద్ద ఉంది. అప్పటి నుండి, 14.5% పెరుగుదల ఉంది.సోమవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1650 పెరిగింది. దీనితో, ఇప్పుడు బంగారం 10 గ్రాములకు రూ.99,800 అయింది. బంగారం కొనుగోలుపై 3% GST చెల్లించాలి. రూ.99,800 లో 3 శాతం రూ.2994. అందువలన, 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,794 అవుతుంది. అంటే మీరు 10 గ్రాముల బంగారం కొంటే, మీరు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
MCXలో కూడా బంగారం ధర 10 గ్రాములకు రూ.98 వేలు దాటింది. ఈ ఉదయం దాని ధర ఒక్కసారిగా పెరిగింది. సోమవారం, MCXలో బంగారం (జూన్ ఫ్యూచర్స్) 10 గ్రాములకు రూ.97,279 వద్ద ముగిసింది. మంగళవారం, ఇది రూ.1,474 పెరుగుదలతో రూ.98,753 వద్ద ప్రారంభమైంది. దీని తరువాత, అది ఊపందుకోవడం ప్రారంభించింది. ఉదయం 10:15 గంటలకు ఇది రూ.98,965 వద్ద ట్రేడవుతోంది.
Also Read: 500 Notes: ఆ రూ. 500నోట్లతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హోంశాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









