)
GST Slabs Scrapping: వస్తువులు, సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలపై.. కంపెనీలపై జీఎస్టీ పెనుభారంగా మారింది. అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ఇష్టారీతిన ధరలు పెంచేసుకుంటుండడంతో వినియోగదారులు ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. శ్లాబుల రద్దుకు మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎమ్) ఆమోదం తెలిపింది. 12 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేయడానికి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రకటించారు.
12 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేయాలనే భారత ప్రభుత్వం రెండు ప్రతిపాదనలకు తాము మద్దతు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన మంత్రుల బృందం సమావేశం అనంతరం సామ్రాట్ చౌదరి తెలిపారు. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌ల రద్దు ప్రతిపాదన ఆమోదించారని చెప్పారు. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు శ్లాబుల రద్దుతో సామాన్యులకు భారీ ఉపశమనం లభించనుంది. జీఎస్టీ స్లాబ్‌ల సంఖ్యను రెండుకు అంటే 5 శాతం, 18 శాతానికి తగ్గించనున్నారు. 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను పూర్తిగా రద్దు కానున్నాయి.
ఢిల్లీలో గురువారం జీఎస్టీపై మంత్రుల బృందం సమావేశమైంది. పెరుగుతున్న ధరలు.. సామాన్యుడికి ఊరట కలిగించేలా తీసుకోవాల్సిన నిర్ణయాలను సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా రెండు శ్లాబులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది. ఇప్పటివరకు నాలుగు జీఎస్టీ స్లాబ్‌లు ఉన్నాయి. వాటిలో 5%, 12%, 18%, 28%. ప్రస్తుతం 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. 12 శాతం, 28 శాతం స్లాబ్‌లను పూర్తిగా రద్దు కానున్నాయి.
ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు గొప్ప ఉపశమనం లభించనుంది. 12 శాతం స్లాబ్ కిందకు వచ్చే చాలా వస్తువులు, సేవలు 5 శాతం కిందకు వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని దాదాపు 90 శాతం వస్తువులు, సేవలు 18 శాతం కిందకు వస్తాయి. పొగాకు, పాన్ మసాలా వంటి వస్తువులపై మాత్రమే అధిక రేట్లు కొనసాగుతాయి.
12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్‌కు మారుతున్న వస్తువులు
==> 12 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించి 5 శాతానికి తగ్గించడం అంటే వీటిపై పన్ను దాదాపు 7 శాతం తగ్గుతుంది. దీనివల్ల ఈ వస్తువులు చౌకగా లభించే అవకాశం ఉంది.
==> బట్టలు, రెడీమేడ్ దుస్తులు (రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర ఉన్న బట్టలు కూడా ఇప్పుడు చౌకగా లభించవచ్చు)
==> పాదరక్షలు
==> ప్రింటింగ్, స్టేషనరీ వస్తువులు
==> ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు
==> గృహోపకరణాలు (వీటిపై 12 శాతం పన్ను విధించే అవకాశం)
28% స్లాబ్ నుంచి 18% స్లాబ్‌కు తగ్గుతున్న వస్తువులు
==> 28% శ్లాబ్‌లోని 90% వస్తువులను 18%కి తీసుకురావడం అంటే వాటి ధరపై పన్ను భారం 10 శాతం తగ్గుతుంది. దీనివల్ల ఈ క్రింది వస్తువులు చౌకగా మారవచ్చు
==> ద్విచక్ర వాహనాలు, కార్లు (చిన్న వాహనాలు, ఎంట్రీ-లెవల్ మోడల్‌లు)
==> సిమెంట్, నిర్మాణ సామగ్రి
==> రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, టీవీలు వంటి వినియోగ వస్తువులు
==> ప్యాక్డ్ చేసిన ఆహారాలు, పానీయాలు
==> పెయింట్స్, వార్నిష్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.