PF News Rule: ఉద్యోగులకు బంపర్ న్యూస్..యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. త్వరలోనే కొత్త రూల్

PF News Rule: వేతన జీవులందరికీ త్వరలోనే శుభవార్త రానుంది. పీఎఫ్ గురించి ఓ పెద్ద వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే పీఎఫ్ కు సంబంధించిన కొత్త రూల్ రాబోతోందని సమాచారం.   

Written by - Bhoomi | Last Updated : Feb 25, 2025, 06:18 PM IST
PF News Rule: ఉద్యోగులకు బంపర్ న్యూస్..యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. త్వరలోనే కొత్త రూల్

PF News Rule:  ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు. పీఎఫ్ కు సంబంధించిన కొత్త రూల్ వస్తుందని సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన చందాదారులకు పీఎఫ్ విత్ డ్రా సులభతరం చేసేందుకు పనిచేస్తోంది. త్వరలోనే పీఎఫ్ కస్టమర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ అంటే యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చని జాతీయ మీడియా వార్తలను ప్రచురించింది. 

Add Zee News as a Preferred Source

జీపే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వినియోగదారులు తమ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ డబ్బును నేరుగా ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రారంభించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. దీనికోసం పీఎఫ్ ఉపసంహరణ యూపీఐ ఫ్లాట్ ఫామ్ తో అనుసంధానం చేసేందుకు ఈపీఎఫ్ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతోంది. నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ స్కీముకు బ్లూప్రింట్ సిద్ధం చేసింది. వీలైనంత తర్వలోనే ఈ సదుపాయాన్ని ప్రారంభించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. 

ఫండ్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియను వేగవంతం చేయడం, కస్టమర్లకు మరింత సులభతరం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉపసంహరణ ప్రక్రియ బ్యాంకు బదిలీల ద్వారా జరుగుతుంది. దీనికి చాలా రోజుల సమయం పట్టవచ్చు. కొత్త వ్యవస్థ యూపీఐ ఆధారిత లావాదేవీలను సులభతరం చేస్తుంది. కొత్త వ్యవస్థ యూపీఐ ఆధారిత లావాదేవీలను సులభతరం చేస్తుంది. పీఎఫ్ వినియోగదారులు లింక్  చేసిన యూపీఐ ఐడీకి తక్షణమే నిధులను బదిలీ చేయడానికి అనుమతి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులు అవసరమైన ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. 

Also Read:  Gold News: బంగారం కొంటే మేకింగ్ ఛార్జీలపై 25% ఫ్లాట్ డిస్కౌంట్ .. ఈ కంపెనీ అందిస్తోన్న గొప్ప ఆఫర్ ఇదే  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 7.4 కోట్లకు పైగా చందాదారులతో 50 మిలియన్లకు పైగా క్లెయిమ్స్ ను పరిష్కరించింది. రూ. 2.05లక్షల కోట్లకుపైగా పంపిణీ చేసింది. ఏ పీఎఫ్ సభ్యుడైనా తనకు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల వైద్య అత్యవసర పరిస్థితుల కోసం నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. కనీసం 5ఏళ్లు సేవలందించిన ఉద్యోగులు కొత్త ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం వారిపీఎఫ్ బ్యాలెన్స్ లో 90శాతం విత్ డ్రా చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగులు కనీసం 3ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే హోంలోన్ తిరిగి చెల్లించడానికి వారి పీఎఫ్ బ్యాలెన్స్ 90శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ సభ్యుడు, వారి తోబుట్టువు లేదా పిల్లల పెళ్లి కోసం కనీసం 7ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు తమ వాటాలో 50శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News