Patanjali Food And Herbal Park: ఆయుర్వేద ఉత్పత్తులకు కేంద్రంగా నిలుస్తున్న పతంజలి సంస్థ ఆసియాలోనే అతిపెద్ద మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌ను ప్రారంభించింది. ఈ పార్క్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న మిహాన్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమంపై అతిథులు ప్రశంసలు కురిపించారు.
Also Read: Silver Price: గోల్డ్ కాదు.. పెట్టుబడిదారుల మొదటి ఎంపిక సిల్వర్.. కారణాలు ఇవే!
'పతంజలి రాష్ట్రంలో భారీ స్థాయిలో సేవలు విస్తరించడం శుభ పరిణామం. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు అమల్లోకి రావడం వెనుక అనేక కష్టాలు ఎదురైనా కూడా స్వామి రామ్ దేవ్ బాబా తన కలను సాకారం చేసుకున్నారు. పతంజలి ప్రధాన లక్ష్యం రైతులను గౌరవించడం. ఈ పార్క్‌తో నాగ్‌పూర్ నారింజ పండ్ల వ్యాపారానికి కేంద్రంగా మారనుంది' అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ పార్క్ ఏర్పాటుతో రైతులు పండ్లను నిల్వ చేసుకోవడం.. సరైన ధర వచ్చినప్పుడు మార్కెట్‌లో విక్రయించుకునే సౌకర్యం లభిస్తుందని సీఎం వెల్లడించారు.
Also Read: Silver Price: గోల్డ్ కాదు.. పెట్టుబడిదారుల మొదటి ఎంపిక సిల్వర్.. కారణాలు ఇవే!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 'మహారాష్ట్రకు రాందేవ్ బాబా గొప్ప వరం. పతంజలి ఫుడ్ పార్క్ సాంకేతికత, అనుధనాతన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో రైతులకు మేలు జరగనుంది. ఈ పార్క్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజానికి రాందేవ్ బాబా సేవలు మరువలేనివి. పతంజలి పార్క్ ద్వారా నారింజ పండ్ల రైతుల జీవితాల్లో వెలుగులు రానున్నాయి. రోజుకు 800 టన్నుల డిమాండ్ ఉండడంతో నారింజ పండ్ల ఉత్పత్తి పెరగనుంది. ఆరెంజ్, నిమ్మకాయలు ఉత్పత్తి పెరగాల్సి ఉంది' అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
నాగ్‌పూర్‌లోని మిషాన్‌లో ఏర్పాటుచేసిన ఈ పార్క్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నెలకొల్పినట్లు పతంజలి సంస్థ యజమాని ఆచార్య బాలకృష్ణ తెలిపారు. మరో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. కరువుకు.. రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న విదర్భ ప్రాంతంలో పతంజలి సంస్థ ఏర్పాటుచేసిన ఈ పార్క్‌తో అక్కడి రైతులకు వరంగా మారనుంది. మార్కెట్ అవకాశాలు.. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో విదర్భ ప్రాంతంలో రైతులకు పూర్వ వైభవం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









