Amazon IPO: ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఐపీఓకు వస్తోన్న అమెజాన్? చర్చలు షురూ చేసిన ఇ కామర్స్ దిగ్గజం

Amazon IPO Valuation: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? సరైన స్టాక్ ఎంచుకుని ఇన్వెస్ట్ పెడుతున్నారా? అయితే మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు..ఎక్కువగా ఐపీఓల కోసం చూస్తుంటారని చెప్పవచ్చు. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయని వీటిపై మొగ్గుచూపుతుంటారు. ఇక ప్రముఖ కంపెనీ నుంచి వచ్చే ఐపీఓలకు డిమాండ్ బాగానే ఉంటుంది. ఈ క్రమంలోనే మరో అతిపెద్ద ఐపీఓకు వచ్చేందుకు రంగం  సిద్ధమైంది.   

Written by - Bhoomi | Last Updated : Mar 18, 2025, 04:54 PM IST
 Amazon IPO: ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఐపీఓకు వస్తోన్న అమెజాన్? చర్చలు షురూ చేసిన ఇ కామర్స్  దిగ్గజం

Amazon IPO Valuation: అమెరికాకు చెందిన ప్రముఖ ఇ -కామర్స్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ దేశీయంగా తొలి పబ్లిక్ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. తన భారత్ యూనిట్ ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చర్యలు ప్రారంభించిదని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జేపీ మోర్గాన్ తోపాటు భారతీయ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులతో అమెజాన్ చర్చలు ప్రారంభించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం గత వారంలో 8నుంచి 10  బ్యాంకులను ఆహ్వానించిందని సమాచారం. 

Add Zee News as a Preferred Source

దేశీయ ఇ-కామర్స్ సంస్థలు మాత్రమే ఇన్వెంటరీ మోడల్ ను కలిగి ఉండటానికి భారత్ నిబంధనలు అనుమతిస్తాయి. అప్పుడు వేగంగా డెలివరీలను పూర్తి చేసేందుకు షిప్పింగ్ ఖర్చులను ఆదా చేసేందుకు వీలు పడుతుంది. విదేశీ సంస్థలు కొనుగోలుదారులు, విక్రేతల మధ్య మధ్యవర్తిగా పనిచేసే మార్కెట్ ప్లేస్  మోడల్ గా వ్యవహారించాల్సి ఉంటుంది. ఐపీఓకు రావడం ద్వారా డేటా లోకలైజ్ చేయడంతోపాటు ఇన్వెంటరీ మోడల్ ను కూడా కలిగి ఉండొచ్చన్నది అమెజాన్ ఆలోచనగా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

మరోవైపు ఇ-కామర్స్ మార్కెట్ వాటాలో ఫ్లిప్ కార్ట్ కంటె అమెజాన్ కాస్త వెనకపడి ఉంది. ముఖ్యంగా మెట్రోయేతర నగరాలపై ద్రుష్టిసారించడం ద్వారా ఫ్లిప్ కార్ట్ కస్టమర్ల బేస్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ఐపీఓకు రానుంది. అందులో భాగంగా తొలుత తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్ కు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ పబ్లిక్ ఇష్యూ కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో వైపు క్విక్ కామర్స్ స్టార్టప్ లైన ఇన్ స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో నుంచి అమెజాన్ పోటీని ఎదుర్కొంటోంది. దీంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ను వేగంగా డెలివరీ చేసేందుకు తాజాగా బెంగళూరులో అమెజాన్ నౌ పేరిట క్విక్ కామర్స్ సర్వీసులను ప్రారంభించింది. 

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News