)
GST Council Meeting 2025: జీఎస్టీ మండలి 56 సమావేశం బుధవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 4వ తేదీన ముగుస్తుంది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేత్రుత్వం వహించారు. జీఎస్టీ రేట్ల సరళీకరణపై ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు ఉన్నాయి. దీంతో 56వ జీఎస్టీ మండలి సమావేశంపై దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 3న ప్రారంభమై, 4న ముగియనున్న ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణ, పన్ను రేట్ల తగ్గింపు, కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక స్లాబ్‌ల అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఆటోమొబైల్ రంగం:
ప్రస్తుతం బైకులు, చిన్న కార్లు సహా ఎక్కువ వాహనాలపై 28శాతం జీఎస్టీ అమలవుతోంది. అయితే ఈ సమావేశంలో 18శాతం స్లాబ్‌లోకి తీసుకురావచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీని వల్ల చిన్న కార్లు, రెండు చక్రాల వాహనాలు చౌకగా మారవచ్చు. కానీ లగ్జరీ కార్లకు మాత్రం ప్రత్యేకంగా 40శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంచనాలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 10శాతం పైగా లాభాలు నమోదు చేసింది.
ఎఫ్ఎంసీజీ సెక్టార్:
సాధారణంగా ప్రతిరోజూ ఉపయోగించే షాంపూ, టూత్‌పేస్ట్, టాల్కమ్ పౌడర్ వంటి వస్తువులపై ప్రస్తుతం 18శాతం జీఎస్టీ ఉంది. కొత్త నిర్ణయాలతో ఇవి 5శాతం స్లాబ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం 12శాతం జీఎస్టీ ఉన్న మిల్క్ పౌడర్, వంట నూనె, నూడుల్స్, చాక్లెట్లు, చక్కెర వంటి వస్తువులపై కూడా 5శాతం మాత్రమే ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది FMCG ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించబోతుంది. దీంతో HUL, ITC, డాబర్, నెస్లే వంటి కంపెనీల స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారు.
ఎలక్ట్రానిక్స్ & కన్స్యూమర్ డ్యూరబుల్స్:
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇవి 18శాతం స్లాబ్‌లోకి మారితే, పండుగ సీజన్లో వినియోగదారులకు భారీ ఉపశమనం లభించనుంది. సామ్సంగ్, సోనీ, LG, విహ్పూల్ వంటి కంపెనీల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ రంగం:
ప్రస్తుతం లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాలపై 18శాతం జీఎస్టీ ఉంది. ఈసారి సమావేశంలో వీటికి పూర్తి మినహాయింపు లేదా 5శాతం జీఎస్టీ మాత్రమే ఉండేలా ప్రతిపాదన ఉండవచ్చని సమాచారం. ఇది ఇన్సూరెన్స్ రంగానికి, పాలసీదారులకు కూడా మంచి వార్త అవుతుందని చెప్పుకోవచ్చు.
టైర్లు:
ఆటోమోటివ్ టైర్ తయారీదారులు ప్రస్తుతం 28శాతం ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. రవాణా, వ్యవసాయం, నిర్మాణం వంటి రంగాల్లో టైర్లు లగ్జరీ వస్తువులు కాదని వారు వాదిస్తున్నారు. ఈ అంశంపై మండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
సిన్ ప్రొడక్ట్స్:
పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లు వంటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40శాతం జీఎస్టీ అమలు చేసే అవకాశం ఉంది. దీనికి అదనంగా సెస్ కూడా విధించే సూచనలు ఉన్నాయి.
పండుగ బహుమతిగా జీఎస్టీ రిఫార్మ్స్?
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే దీపావళి సందర్భంగా ప్రజలకు పెద్ద బహుమతి ఇవ్వబోతున్నట్లు సూచించారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపును కూడా పండుగ సీజన్‌కు ముందే అమలు చేసే అవకాశం ఉంది. గురువారం సమావేశం ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెలువడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.