
Best Post Office Schemes: మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే రిస్క్ తీసుకోకూడదనుకుంటే ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే మీరు చిన్న పొదుపు స్కీముల్లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్ కు సంబంధించిన పలు స్కీముల గురించి ఇప్పుడు చూద్దాం.
చిన్న పొదుపు పథకాలు ప్రభుత్వ మద్దతుతో నడుస్తుంటాయి. ఈ స్కీములకు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. అయితే సేఫ్ గా మీ డబ్బులు రెట్టింపు అయ్యే స్కీముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ పెట్టుబడి స్కీమ్. ఈ స్కీముపై 7.1శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ లో కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీము 15ఏళ్లలో పూర్తి అవుతుంది. కానీ దీనిని ప్రతి ఏడాది 5 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.
పోస్టాఫీస్ కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుంది. టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రభుత్వం పోస్టాఫీస్ నుంచి అధికారికంగా అమలు చేస్తుంది. ఏడాది నుంచి 5ఏళ్ల వరకు పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడానికి టైమ్ డిపాజిట్ అనుకూలంగా ఉంటుంది. టీడీ పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7.5శాతం వరకు ఉంటుంది.
సుకన్య సమ్రుద్ది యోజన స్కీములో 10ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల కోసం ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ స్కీములో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 , గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీము 21ఏళ్లలో పూర్తవుతుంది. మీ కూతురుకు 18ఏళ్లు నిండి, మీరు ఆమెకు పెళ్లి చేయాలనుకుంటే ఈ ఖాతాను క్లోజ్ చేయవచ్చు.
ఇక స్కీమ్ కిసాన్ వికాస్ పత్ర.. ప్రస్తుతం ఈ పథకంపై 7.5శాతం వరకు అత్యధికంగా వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ స్కీములో కనీసం రూ. 1000 డిపాజిట్ తో అకౌంట్ తీసుకోవచ్చు. గరిష్ట పెట్టుబడి లిమిట్ అంటూ ఉండదు. కిసాన్ వికాస్ పత్ర కింద మీరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బు 115 నెలల్లో నేరుగా రెట్టింపు అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి