)
Indian IT Shares: అమెరికా అధ్యక్షుడిగా రెండోవసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నీ కుదేలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత్, చైనా, యూరప్ దేశాలపై భారీగా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇప్పటికే టారిఫ్ ల పేరుతో రచ్చ రచ్చ చేసిన ట్రంప్ తాజాగా శుక్రవారం హెచ్ 1 బి వీసా వార్షిక ఫీజును ఒక్కసారిగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హఠాత్తు పరిణామం భారత్, అమెరికా టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది. హెచ్ 1 బి వీసాలపై ఆధారపడే కొన్ని కంపెనీలు ఇప్పుడు పెద్దమొత్తంలో ఖర్చులు భరించాల్సి వస్తుంది.
అయితే ఇప్పుడు భారత టెక్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కునే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన ఐటీ దిగ్గజాలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్, కాగ్నిజెంట్, ఎల్టీఐ, మైండ్ ట్రీ వంటి కంపెనీలు మొత్తం 13,396 హెచ్ 1బీ వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి. వీటి ఖర్చు ఇప్పటి వరకు సుమారు 13.4 మిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ కొత్త ఫీజు పెంపుతో ఇది 1.34 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల లాభాల్లో సుమారు 10శాతం సుమానంగా ఖర్చు మాత్రమే వీసాల ఫీజుల ఖర్చుల కోసం వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సోమవారం స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావం చూసే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగ్నిజెంట్ షేర్లు నాస్డాక్ లో 4.75శాతం ఇన్ఫోసిస్ షేర్ ఎన్వైఎస్ఈలో 3.4శాతం మేర పడిపోయాయి. ఈ ఆర్థికభారం కారణంగా మరో వారంలో ఇతర టెక్ కంపెనీల షేర్లపై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే ఎన్విడియా, అమెజాన్, మెటా, టెస్లా, ఆపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు కూడా హెచ్ 1 బి వీసాల ద్వారా భారత టెక్ నిపుణులను నియమిస్తాయి. ఈ ఫీజు పెంపుతో వీటి ఖర్చులు భారీగా పెరుగుతాయి. అమెరికా ఉద్యోగుల జీతాలు భారత నిపుణుల సామర్థ్యానికి పోలిస్తే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల లాభాలను తగ్గిస్తుంది.
Also Read: USA: ట్రంప్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..భారత్ నుంచి అమెరికాకు రెట్టింపు ఛార్జీలు..!!
ఇక ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీమా శ్రీవాస్తవ మాట్లాడుతూ హెచ్ 1 బి వీసా పెంపు అనేది భారత, అమెరికా కంపెనీల ఖర్చులను భారీగా పెంచుతుందన్నారు. పోటీతత్వం తగ్గడం, జూనియర్, మిడ్ లెవల్ జాబ్స్ రిక్రూట్ మెంట్ అనేది ఆలస్యం అవుతుంది. కొత్త ఉద్యోగాలు ఇతర దేశాలకు మారే ఛాన్స్ కూడా ఉంటుందన్నారు. బసవ్ క్యాపిటల్ సహా వ్యవస్థాపకుడు సందీప్ పాండ్ మాట్లాడుతూ..వీసా ఫీజు పెంపుతో ఉద్యోగుల ఖర్చులు పెరగడమే కాదు..కంపెనీల లాభాలు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
మొత్తానికి హెచ్ 1 బీ వీసా ఫీజులు పెంపు భారత్, అమెరికా టెక్ కంపెనీల బిజినెస్, ఇన్వెస్ట్ మెంట్స్, జాబ్స్ రిక్రూట్ మెంట్‌పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. స్టాక్ మార్కెట్లో కూడా టెక్ దిగ్గజాల షేర్లలో భారీ కుదింపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పండగ, ఫైనాన్షియల్ సీజన్లో ఈ పరిణామం మరింత ప్రతికూలతను కలింగే విధంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.