)
H-1B Visa Cost: అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి కలలు కల్లలుగా మారాయి. హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వీసా దరఖాస్తు ఫీజులు కొన్ని వేల డాలర్లలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని నేరుగా లక్ష డాలర్లకు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.88 లక్షలకు పెంచింది ట్రంప్ సర్కార్. ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో అమెరికాలో పనిచేస్తున్న టెకీలు, కొత్త వీసా కోసం ఎదురుచూస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ గందరగోళానికి గురి అవుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న వందలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు తమ వీసా గడువు పూర్తవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో, పొడిగింపు కోసం రుసుము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కొత్తగా విధించిన ఈ అతి భారీ ఫీజు కారణంగా, వారికి అక్కడి ఉద్యోగ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకుందని వాపోతున్నారు. ప్రత్యేకంగా తక్కువ వేతనాలు తీసుకుంటున్నవారికి ఇది బిగ్ షాకింగ్‌గా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఒక భారతీయ టెకీ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. “నేను అమెరికాలోని ఓ టెక్ కంపెనీలో గత మూడు ఏళ్లుగా సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. నా హెచ్-1బీ వీసా కంపెనీ స్పాన్సర్ చేసింది. కానీ ఇప్పుడు వీసా గడువు ముగుస్తోంది. ట్రంప్ తాజా నిర్ణయం ప్రకారం వీసా పొడిగించుకోవాలంటే లక్ష డాలర్లు, అంటే రూ.88 లక్షలు చెల్లించాలి. నా ఏడాది జీతమే లక్ష డాలర్లు. అలాంటప్పుడు మొత్తం జీతాన్ని వీసా రుసుముకే కట్టాల్సి వస్తుంది. ఇది ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు.
ఈ తరహా సమస్యను అనేక మంది భారతీయ టెకీలు ఎదుర్కొంటున్నారు. వీసా కోసం అంత పెద్ద మొత్తం చెల్లించగలిగే స్థోమత కంపెనీలకు లేదని, ఇకపై అమెరికాలో పనిచేయడం కష్టమవుతుందని వారు వాపోతున్నారు. మరోవైపు, కొత్తగా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్ళాలని భావిస్తున్న యువత ఈ నిర్ణయంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అమెరికా ఉద్యోగులను కాపాడే ఉద్దేశమే ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ భారతీయ టెకీలకు మాత్రం ఇది భవిష్యత్తు గురించి పెద్ద ప్రశ్నార్థకమే అయ్యింది. ఇప్పటికే వీసా లాటరీ సిస్టమ్, కఠినమైన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న ఐటీ ఉద్యోగులు, ఇప్పుడు ఈ కొత్త రుసుము పెంపుతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.