HCL Share: క్యూ4 రిజల్ట్స్ ఊపుతో దూసుకెళ్తున్న HCL షేర్ ధర...ఇంట్రాడేలో 7 శాతం లాభం...మీరు ఓ లుక్ వేయండి

HCL Share: దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ HCL టెక్నాలజీస్ షేర్ నేడు ఏడు శాతం పెరిగాయి. కంపెనీ క్వార్టర్లీ ఫలితాలు విడుదల చేసిన అనంతరం, ఈరోజు ఇంట్రాడేలో HCL టెక్నాలజీస్ షేర్ ఒక్కసారిగా ఏడు శాతం పెరిగి రూ. 1587 కు చేరుకుంది. అయితే ఈ కంపెనీ షేర్ల పెరుగుదలకు కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 23, 2025, 01:41 PM IST
HCL Share: క్యూ4 రిజల్ట్స్ ఊపుతో దూసుకెళ్తున్న HCL షేర్ ధర...ఇంట్రాడేలో 7 శాతం లాభం...మీరు ఓ లుక్ వేయండి

HCL Share: దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ HCL టెక్నాలజీస్ షేర్ నేడు ఏడు శాతం పెరిగాయి. కంపెనీ క్వార్టర్లీ ఫలితాలు విడుదల చేసిన అనంతరం, ఈరోజు ఇంట్రాడేలో HCL టెక్నాలజీస్ షేర్ ఒక్కసారిగా ఏడు శాతం పెరిగి రూ. 1587 కు చేరుకుంది. అయితే ఈ కంపెనీ షేర్ల పెరుగుదలకు కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

 1. అంచనాలను మించిన ఫలితాలు ముఖ్యంగా కంపెనీ ఆదాయ అంచనాలు విశ్లేషకులు వేసిన అంచనాల కన్నా మెరుగ్గా ఉన్నాయి ఈ కారణంగా కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కంపెనీ ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి, అనే దాని పైన అనిశ్చితి మాత్రం నెలకొని ఉంది. ఈ మేరకు కంపెనీ ఫలితాల పైన మెరుగైన ప్రదర్శన కనిపించడంతో ఒకసారిగా షేర్ల విలువ పెరిగింది. 

2. కొత్త ఒప్పందాలు
అయితే మార్చి నెలలో ముగిసిన క్వార్టర్లీ ఫలితాల్లో కొత్త ఒప్పందాల మీద వచ్చిన కాంట్రాక్టు విలువ టీసీవీ సరిపోయేంత బలంగా లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది భవిష్యత్తులో కంపెనీ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశంగా పేర్కొంటున్నారు. 

Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?  

3. బ్రోకరేజి సంస్థల రేటింగ్ ఇదే
ఇదిలా ఉంటే క్యూ4 ఫలితాలు అనంతరం సిటీ బ్యాంకు తన న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది అంతేకాదు టార్గెట్ ధరను రూ. 1510 ఫిక్స్ చేసింది. FY26, FY27కు EPS (షేర్లపై ఆదాయం) అంచనాలను 2% తగ్గించినట్లు పేర్కొంది. దీనికి ప్రధానంగా రాబోయే కాలంలో కంపెనీ 0% CAGR ఉండే అవకాశం ఉందని రిపోర్టులో పేర్కొంది. ఈ కారణంగానే ఆదాయం అంచనాలను తగ్గించారు. 

4. ఇతర సంస్థలతో పోటీఇదే రంగంలో పనిచేసే ఇతర ఐటీ కంపెనీలతో పోల్చి చూసినట్లయితే పనితీరు మంచిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థ బలమైన వృద్ధి కారణంగా భవిష్యత్తులో కూడా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు కంపెనీ తన భవిష్యత్తు కార్యాచరణను ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించిందని డిమాండ్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు టెక్నాలజీలను మార్పు చేసుకుంటూ దూసుకెళ్తోందని పేర్కొన్నారు. 

HCL టెక్నాలజీస్ సానుకూల ఫలితాలను పొందినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం దీని వృద్ధి విషయంలో అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి సిఫార్సుగా పరిగణించకూడదు. జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి పెట్టుబడి సూచనలు సలహాలు ఇవ్వదు. ఈ సమాచారాన్ని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గా మాత్రమే చూడాల్సి ఉంటుంది. మీరు పెట్టే పట్టుబడులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడి ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకుంటే మంచిది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News