)
Heavy Rains: తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం, గురువారం సెలవులు ప్రకటిస్తూ.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలకు బుధవారం, గురువారం ఒంటిపూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని ఇంచార్జీ మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారీ సమీక్షించారు. మూడు రోజులు పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు వచ్చినట్లయితే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాఫ్టర్లు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధంగా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook