)
Heritage Foods: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదొడుకుల్లో ముగిసింది. ఒక స్టాక్ మాత్రం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. అదే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఉదయం సెషన్లో లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టిన వేళ, ఈ డెయిరీ కంపెనీ స్టాక్ మాత్రం విపరీతంగా ఎగిసిపడి ప్రమోటర్ల సంపదను భారీగా పెంచింది. గురువారం రోజు రూ. 488.10 వద్ద ముగిసిన 2 శాతం లాభంతో రూ. 498.65 వద్ద ఓపెన్ అయింది. అక్కడి నుంచి వేగంగా పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో రూ. 540 గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి 9 శాతం లాభంతో రూ. 532 వద్ద ట్రేడవుతూ మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఒక్కరోజు లాభాలతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తుంటే, ప్రమోటర్ల సంపదలోనూ వందల కోట్ల రూపాయల పెరుగుదల నమోదైంది.
నిపుణుల అంచనాల ప్రకారం, ఈ స్టాక్ పెరుగుదల వెనుక ప్రధాన కారణం ‘కప్ అండ్ హ్యాండిల్’ ఫార్మేషన్ అని చెబుతున్నారు. టెక్నికల్ అనాలిసిస్లో దీనిని బుల్లిష్ ప్యాటర్న్గా పరిగణిస్తారు. ఒక దశలో షేర్ ధర పడిపోవడం, ఆ తర్వాత మళ్లీ ‘U’ ఆకారంలో తిరిగి పెరగడం దీనికి లక్షణం. ఈ ప్యాటర్న్ ఏర్పడిన వెంటనే షేర్ ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ షేర్లలో అదే సంకేతం కనిపించడం వల్లే ఇన్వెస్టర్లు బలంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
హెరిటేజ్ ఫుడ్స్‌లో ప్రమోటర్ల వాటా 30 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించినప్పటికీ, ప్రస్తుతం ఆయన ఎలాంటి పదవిలో లేరు. కంపెనీకి ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
వాటా వివరాలు చూస్తే, భువనేశ్వరి అత్యధికంగా 2,26,11,525 షేర్లను (24.37%) కలిగి ఉన్నారు. ఒక్కరోజే షేర్ ధర 10 శాతం ఎగబాకడంతో ఆమె సంపద దాదాపు రూ. 117 కోట్ల మేర పెరిగింది. నారా బ్రాహ్మణి వద్ద ఉన్న 4,30,952 షేర్ల విలువ సుమారు రూ. 2.23 కోట్లు పెరిగింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వద్ద 1,00,37,453 షేర్లు ఉండగా, ఆయన సంపదలో రూ. 52 కోట్లకుపైగా లాభం నమోదైంది. లోకేష్ కుమారుడు దేవాన్ష్ వద్ద ఉన్న 56,075 షేర్ల విలువ ఒక్కరోజులోనే దాదాపు రూ. 29 లక్షలు పెరిగింది.
ఈ లెక్కలు చూస్తే, ఒక్క సెషన్లోనే నారా కుటుంబానికి చెందిన ప్రమోటర్ల సంపదలో భారీగా పెరుగుదల జరిగిందని చెప్పొచ్చు. అయితే నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే, స్టాక్ మార్కెట్ ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతుంది. కాబట్టి ఈ లాభాలు తాత్కాలికమే అయ్యే అవకాశముంది. కానీ టెక్నికల్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్‌పై ఇంకా కొనుగోలు ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి, మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉన్నా కూడా హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ గురువారం రోజు పెట్టుబడిదారులు, ముఖ్యంగా ప్రమోటర్లకు కాసుల వర్షం కురిపించింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ఇంకా ఎటు వెళుతుందన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.