Earthquake in Myanmar: మయన్మార్, థాయ్ లాండ్ ను వణికించిన రెండు భారీ భూకంపాల గురించి ముందే హెచ్చరికలు వచ్చాయా. త్వరలోనే భూకంపాలు, సునామీ వంటి ప్రక్రుతి విపత్తులు రానున్నాయని నెలరోజుల కిందటే జపనీయులు అనుమానించడానికి గల ఆధారాలే ఏమిటి. జపాన్ పూర్వీకులు కథలుగా చెప్పుకునే సముద్ర దేవుడి ప్యాలెస్ దూత నెలరోజుల ముందుగానే ఈ సంకేతాలను అందించిందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
జపనీయుల జానపద కథల్లో డూమ్స్ డే ఓర్ షిష్ కు ర్యుగు నో సుకై లేదా సముద్ర దేవుడి ప్యాలెస్ దూత అని పేరు ఉంది. 2011లో జపాన్ లోని బీచ్ లో ఇలాంటి చేపలు కొట్టుకు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే టోక్యోకు విధ్వంసక సునామీ వచ్చింది. నిజానికి బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్, డూమ్స్ డే వంటి చేపలు మహా సముద్రాల అగాధాల్లో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో ఉపరితలంపై కనిపించాయి. అందులో డూమ్స్ డే ఫిష్ ఒడ్డుకు చేరి చనిపోయింది. యాంగ్లర్ షిఫ్ తక్కువ లోతులో ఈదుతూ సముద్ర పరిశోధకులకు కనిపించింది. ఇలాంటి పరిణామాలు ప్రక్రుతి వైపరీత్యాలకు దారి తీస్తుందని జపనీయుల విశ్వాసం. ఇలా కనిపించిన గత సందర్భాల్లో సునామీ వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.
Also Read: Gold Rate Today: ఉగాదికి ముందే దుమ్మురేపిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే పిచ్చెక్కడం ఖాయం
A deep-sea creature rarely seen by humans called the oarfish has washed ashore in Mexico!
Legend has it that this mysterious “doomsday fish” only emerges from the ocean’s depths when disaster is near ?
pic.twitter.com/NciJ7jbEbo— FearBuck (@FearedBuck) February 18, 2025
సైన్స్ ఏం చెబుతోంది?
లోతైన సముద్ర జీవులకు పైకి రావడం అనేది పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి 90శాతం అదనపు వేడి సముద్రం గ్రహిస్తుందని లోతైన ప్రాంతాల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడమో లేక ఆహార అన్వేషణలో భాగంగా చేపలు, ఇతర సముద్ర జంతువులు వలస వెళ్తుంటాయని తెలిపారు. ఎన్ నినో, లా నినా ప్రభావాలుకూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయని ఆ పరిస్థితి సముద్ర జీవులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుందని వివరించారు.
Also Read: IPL 2025: ధోనీని ఎంతైనా తిట్టుకోండి.. ఈ రికార్డు మాత్రం మీ ఫేవరెట్ ప్లేయర్ జన్మలో చేరుకోలేడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









