Gold Coin: అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నారు ఈ పండగను సంపదకు సూచికగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే శుభప్రదం అవుతుందని చాలామంది నమ్ముతారు. బంగారం ప్రస్తుతం భారీగా పెరిగింది ఈ నేపథ్యంలో బంగారం కొనాలి అంటే ఆచి తూచి అడుగు వేయాల్సిన అవసరం ఏర్పడింది.
మీ బడ్జెట్ పరిమితం అయినట్లయితే అక్షయ తృతీయ రోజు బంగారం నాణెం కొనుగోలు చేయవచ్చు. బంగారం నాణేలు 24 క్యారట్ల బంగారం ఉపయోగించి తయారుచేస్తారు. బంగారు నాణెం కొనుగోలు చేయాలంటే బంగారం మార్కెట్ ధరను ముందుగా గమనించాలి. ఇటీవల బంగారం ధరలు రోజువారీ మారిపోతున్నాయి కాబట్టి కొనుగోలు ముందు ధరను బాగా పరిశీలించాలి.
బంగారం కాయిన్స్ నగల దుకాణాల్లోనూ బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీస్ లో సైతం విక్రయిస్తారు. బంగారం ధర అనేది రెగ్యులర్‌గా వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌లలో చెక్ చేసుకోవచ్చు. ఉదయం మరియు సాయంత్రం ధరల్లో తేడా ఉంటుంది. మీరు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ముందుగా ఎంపిక చేసుకున్న దుకాణానికి వెళ్లి అక్కడ ఆరోజు మార్కెట్ ధరకు 24 క్యారెట్ల బంగారం ఎంత కు లభిస్తుందో చూసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బంగారు నాణ్యాలు ట్యాంపర్ ప్రూఫ్ సీల్ ఉన్నట్లయితే సురక్షితంగా భావించవచ్చు.
విడిగా ఉన్న బంగారు నాణెన్ని హాల్ మార్క్ గమనించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు బంగారు నాణెం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే జ్యువెలరీ షాపుల కన్నా బ్యాంకులు లేదా రిజిస్టర్ అయిన గోల్డ్ డీలర్ల దగ్గర నాణెపు బంగారం కాయిన్లు కొంటే శుద్ధత, ధర రెండూ నమ్మకంగా లభించే అవకాశం ఉంది.
Also Read: Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవే
బంగారు నాణెం కొనుగోలు చేసేటప్పుడు అది 24 క్యారెట్ ప్యూరిటీ గోల్డ్ అవునో కాదో నిర్ధారించుకొని మాత్రమే కొనండి. హాల్‌మార్క్ చూసి కొనడం తప్పనిసరి అన్న విషయం మర్చిపోవద్దు. గోల్డ్ కొనుగోలుపై మేకింగ్ చార్జీలు లేదా ఇతర అదనపు ఖర్చులు ఉంటాయి. వీటన్నింటిని గమనించిన అనంతరం మాత్రమే మీరు బంగారు కాయిన్ కొనాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆన్లైన్ ఈ కామర్స్ కంపెనీలు కూడా బంగారు నాణేలు విక్రయిస్తున్నారు. బంగారు నాణెం అర గ్రాము నుంచి లభిస్తుంది. 10 గ్రాముల వరకు మీరు కొనుగోలు చేయవచ్చు. చిన్న పరిమాణాల్లో కొనడం ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో మీరు బంగారం నిల్వలు పెంచుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









