EPFO: UAN లేకుండా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు..ఎలాగో పూర్తి వివరాలు తెలుసుకోండిలా

EPFO: మీకు  UAN నెంబర్ గుర్తు లేకుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. UAN లేకుండా కూడా, మీరు ఇంట్లో కూర్చొని నిమిషాల్లో మీ PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Feb 28, 2025, 01:47 PM IST
EPFO: UAN లేకుండా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు..ఎలాగో పూర్తి వివరాలు తెలుసుకోండిలా

EPFO: గత కొన్ని సంవత్సరాలుగా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సేవలను నిరంతరం మెరుగుపరుస్తోంది. దీంతో కోట్లాది మంది సభ్యులు EPF సౌకర్యాల ప్రయోజనాలను సులభంగా పొందగలరు.అయితే EPF కి సంబంధించిన చాలా సౌకర్యాలను పొందడానికి, సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే UAN ఉండటం చాలా ముఖ్యం. కానీ ఇప్పటికీ చాలా మంది EPF సభ్యులు UAN లేకుండానే ఉన్నారు.

Add Zee News as a Preferred Source

మీకు  UAN లేకపోయినా..మర్చిపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. UAN లేకుండా కూడా, మీరు ఇంట్లో కూర్చొని నిమిషాల్లో మీ PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. EPF సభ్యులు తమ వద్ద యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేకపోతే మిస్డ్ కాల్, SMS ద్వారా వారి PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

SMS ద్వారా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? 

SMS ద్వారా PF బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, ముందుగా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు SMS పంపాలి. దీని ఫార్మాట్ ఇలా ఉంటుంది: 'EPFOHO UAN [భాష కోడ్‌ను ఎంచుకోండి]'

ఉదాహరణకు: మీరు ఆంగ్ల భాషలో అప్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు SMS లో "EPFOHO UAN ENG" అని టైప్ చేయాలి. అయితే మరాఠీలో అప్ డేట్స్ పొందాలనుకుంటే  "EPFOHO UAN MAR" ని ఉపయోగించాలి. అదేవిధంగా, మీకు కావలసిన భాష కోడ్‌ను పంపడం ద్వారా మీరు అప్ డేట్స్ పొందవచ్చు. ఎవరి యూనివర్సల్ ఖాతా యాక్టివ్‌గా ఉందో.. బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్‌కి లింక్ చేస్తామో వారు మాత్రమే ఈ సేవను పొందగలరు. మీ UAN బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో లింక్ చేయబడకపోతే, మీరు ముందుగా e-KYC ధృవీకరణను పూర్తి చేయాలి.

మీరు మిస్డ్ కాల్ తో కూడా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు: 

మీరు మిస్డ్ కాల్ ద్వారా మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి క్రింద ఇచ్చిన  దశలను అనుసరించడం ద్వారా మీరు దానిని సులభంగా తెలుసుకోవచ్చు.

ముందుగా మీరు మీ EPFO ​​ఖాతాలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుండి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తరువాత, మీ కాల్ ఆటోమెటిగ్గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకన్లలో, PF బ్యాలెన్స్ వివరాలు మీ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా వస్తాయి. ఈ సర్వీస్ పూర్తిగా ఫ్రీగా అందిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి సభ్యులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

Also Read: Stock Market: భారీనష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్   

మీ UAN నంబర్‌ను ఎలా తెలుసుకోవాలి? 

మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోతే.. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ తెలుసుకోవాలనుకుంటే, మీరు కొన్ని దశలను అనుసరించడం ద్వారా దానిని తెలుసుకోవచ్చు. మీ UAN తెలుసుకోవడానికి మీరు మీ జీతం స్లిప్‌ను తనిఖీ చేయాలి. UAN నంబర్ తరచుగా నమోదు అవుతుంది. మీరు పనిచేసే సంస్థ HR విభాగాన్ని సంప్రదించడం ద్వారా మీ UAN గురించి తెలుసుకోవచ్చు.
Also Read: Tirumala: తిరుమలలో మార్చి 14న ప్రత్యేక వేడుక.. ఈ భక్తులు రావొద్దని చెప్పిన టీటీడీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News