)
CIBIL Score: నేటికాలంలో ఉద్యోగం చేస్తున్నవారందరికీ సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం.ఉద్యోగాలే కాదు వ్యాపారాలు చేస్తున్న వారు కూడా లోన్ తీసుకుంటుంటారు. లోన్ తీసుకోవడం.. ఈఎంఐ రూపంలో లోన్స్ క్లియర్ చేసుకోవడం మనం చూస్తుంటాం. అయితే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే మాత్రం కచ్చితంగా సిబిల్ స్కోర్ బాగుండాలి. ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకునే ముందు సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ దరఖాస్తును తిరస్కరిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
చాలా మందికి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు అవసరం అయ్యే సందర్భాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో అత్యవసర నిధి ఉంటే పెద్దగా ఇబ్బంది లేకుండా పరిస్థితిని ఎదుర్కొనవచ్చు. కానీ చాలామంది దగ్గర అలాంటి సేవింగ్స్ లేకపోవడంతో, వారు చివరిగా ఆశ్రయించే మార్గం బ్యాంకు రుణం. అయితే రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు మొదట బ్యాంకులు పరిశీలించే అంశం CIBIL స్కోరు. ఇది వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను సూచించే ముఖ్యమైన సూచిక. స్కోరు తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాన్ని తిరస్కరించే అవకాశం ఎక్కువ. అందుకే సిబిల్ స్కోరు తక్కువ అయితే రుణం ఎలా పొందాలి? అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది.
CIBIL స్కోరు బలహీనంగా ఉన్నా కూడా కొన్ని మార్గాల ద్వారా రుణం పొందడం సాధ్యం. అందులో ఒకటి Fixed Deposit (FD) పై రుణం తీసుకోవడం. FD ఉన్నవారికి బ్యాంకులు సెక్యూర్డ్ లోన్ రూపంలో రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే, ఈ రుణం పూర్తిగా మీ FD పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోరు ఎంత ఉన్నా, బ్యాంక్ పెద్దగా ఆలోచించకుండా FD ను పూచీకత్తుగా తీసుకుని రుణం ఆమోదిస్తుంది. మీరు ఏదైనా కారణంతో రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంకు మీ FD మొత్తంలోనుండే నిల్వ ఉన్న బాకీని సర్దుబాటు చేసుకోవచ్చు. అందువల్ల తక్కువ CIBIL స్కోరు ఉన్న వ్యక్తులకు FD లోన్ అత్యంత సులభమైన , నమ్మదగిన ఎంపికగా భావిస్తుంది.
సాధారణంగా బ్యాంకులు FD విలువలో 80శాతం నుంచి 90శాతం వరకు రుణాన్ని ఆమోదిస్తాయి. ఉదాహరణకు, మీ FD మొత్తం రూ. 1 లక్ష అయితే, దాని పై సుమారు రూ. 90,000 వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు, ఈ రుణాన్ని సమయానికి చెల్లించడం ద్వారా మీ CIBIL స్కోరు గణనీయంగా మెరుగవుతుంది. సకాలంలో EMIలు చెల్లిస్తే స్కోరు 100 పాయింట్లవరకు కూడా పెరగవచ్చు. అంటే, FD పై రుణం తీసుకోవడం తాత్కాలిక ఆర్థిక ఇబ్బందిని తీర్చడమే కాకుండా, భవిష్యత్తులో మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.
ఇలా చూస్తే, సిబిల్ స్కోరు తక్కువ ఉండడం వల్ల రుణం రాదని నిరాశ చెందాల్సిన పనిలేదు. మీ దగ్గర FD ఉండి, దాని పై రుణం తీసుకునే అవకాశం ఉంటే, అది అత్యంత సురక్షితమైన, వేగవంతమైన పరిష్కారం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook