Loan in 10 Minutes: రుణాల కోసం గతంలోలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొన్ని నిర్ణీత డాక్యుమెంట్లు ఉంటే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా రుణాలు పొందవచ్చు. 10 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఈజీగా తీసుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు కొన్ని వివరాలు ఇస్తే చాలు. ముఖ్యంగా పర్సనల్ లేదా బిజినెస్ లోన్స్ ఇప్పుడు చాలా ఈజీ అయ్యాయి.
రుణాల కోసం అప్లై చేసేదుకు ముఖ్యంగా కావల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెసిడెన్షియల్ ప్రూఫ్. బ్యాంక్ పాస్‌బుక్ లేదా గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్. అదే బిజినెస్ లోన్ అయితే రిజిస్ట్రేషన్ పత్రాలు, జీఎస్టీ కావల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి. వీటికి సంబంధించిన యాప్స్ ద్వారా లోన్లు తీసుకోవచ్చు. ఎస్బీఐ యోనో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐరిస్ బ్యాంక్, పీఎన్‌బి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐ మొబైల్ యాప్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటివి చాలానే ఉన్నాయి. ఇవి కాకుండా బజాజ్ ఫిన్‌సర్వ్, పిరామిల్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా, టాటా ఫైనాన్స్ వంటివి ఉన్నాయి.
ఎలా అప్లై చేయాలి
ముందుగా కావల్సిన బ్యాంక్ లేదా ఎన్‌బిఎఫ్‌సి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ బ్యాంక్ ఎక్కౌంట్, ఫోన్ నెంబర్ వివరాలతో రిజిస్టర్ అవాలి. కావల్సిన లోన్ ఎంచుకోవాలి. పాన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇఎంఐ ఇతర వివరాలు ఎంపిక చేసుకోవాలి. ఇ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. మీరిచ్చిన వివరాలు ధృవీకరణ అయితే రుణం వెంటనే 10 నిమిషాల్లోనే మీ ఎక్కౌంట్‌లో చేరుతుంది.
ఆధార్ కార్డు సహాయంతో బిజినెస్ లోన్ కూడా సులభంగా తీసుకోవచ్చు. పీఎం ముద్రా లోన్ స్కీమ్ ద్వారా 50 వేల నుంచి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. వీటిలో శిశు ముద్రా లోన్ 50 వేల వరకు తీసుకోవచ్చు. కిశోర్ ముద్ర లోన్ 5 లక్ష వరకు, తరుణ్ ముద్ర లోన్ 10 లక్షల వరకు పొందవచ్చు. వీటిని పొందేందుకు www.mudra.org.in సందర్శించాలి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అప్‌డేట్ అయుంటే రుణం పొందడం సులభమౌతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









