Hyderabad Real Estate: దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో గ్రుహ విక్రయాలు 28శాతం తగ్గి, 93,280 యూనిట్లకు చేరుకున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,30,170యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో హౌసింగ్ మార్కెట్ మందగించిందని స్పష్టం చేసింది. ఈ తగ్గుదల ప్రధానంగా..ఇళ్ల ధరల పెరుగుదల, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు వంటి కారణాలతో జరిగిందని పేర్కొంది. అయినప్పటికీ భారతదేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని..జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా ఉండి..ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో అమ్మకాలు 20శాతం తగ్గి 12,520 యూనిట్లకు చేరుకుంటాయని అనరాక్ అంచనా వేసింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ఇళ్ల అమ్మకాలు 26శాతం తగ్గి 31,610 యూనిట్లకు చేరుకుంటాయని వెల్లడించింది. అనరాక్ రిపోర్ట్ ప్రకారం ఇదే బెంగళూరులో అమ్మకాలు 16శాతం తగ్గి 15000 యూనిట్లకు పరిమితం అవుతాయని తెలుస్తోంది. పుణెలో అమ్మకాలు 30శాతం పడిపోయి 16,100యూనిట్లకు చేరుకోవచ్చని వెల్లడించింది.
Also Read: Gold Rate Today: ఉగాదికి ముందే దుమ్మురేపిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే పిచ్చెక్కడం ఖాయం
ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరించిన హైదరాబాద్ లోనూ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ జనవరి మార్చి 3 నెలల కాలంలో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 49శాతం తగ్గి 10,100 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. అంతుకుముందు ఏడాది ఇదే సమయంలో సంఖ్య ఏకంగా 19, 660 యూనిట్లుగా ఉండేది. చెన్నైలో అమ్మకాలు 26శాతం, కోల్ కతాలో 31శాతం తగ్గనున్నట్లు తెలిపింది. ఇక మొత్తంగా చూసుకుంటే టాప్ 7 నగరాల్లో హైదరాబాద్ లోనే అమ్మకాలు భారీగా క్షీణించినట్లుగా కనిపిస్తోంది.
Also Read: IPL 2025: ధోనీని ఎంతైనా తిట్టుకోండి.. ఈ రికార్డు మాత్రం మీ ఫేవరెట్ ప్లేయర్ జన్మలో చేరుకోలేడు
మొత్తంమీద, టాప్ ఏడు నగరాల్లో Q1-2025లో సుమారు 1,00,020 యూనిట్లు ప్రారంభించాయి. 2024 Q1లో 1,10,865 యూనిట్లు ప్రారంభించాయి. ఇది 10% క్షీణతను నమోదు చేసింది. NCR లో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది.ఈ ప్రాంతంలో కొత్త లాంచ్‌లు 53% పెరిగాయి. ఆసక్తికరంగా, అనరాక్ పరిశోధన ప్రకారం, లగ్జరీ అల్ట్రా-లగ్జరీ విభాగం (₹1.5 కోట్ల కంటే ఎక్కువ ధర) కొత్త లాంచ్ లలో ఆధిపత్యం చెలాయించిందని, మొత్తం సరఫరాలో 42% వాటా కలిగి ఉందని, ఆ తర్వాత ప్రీమియం విభాగం (₹80 లక్షలు - ₹1.5 కోట్లు) 27% వాటా కలిగి ఉందని వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








