Hyderabad Real Estate: దక్షిణ భారత దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరం దక్షిణ భారత దేశంలో బెంగళూరు తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా చెప్పవచ్చు. భారతదేశంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత నాలుగు వైపులా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి మాత్రమే నాలుగు వైపులా విస్తరించడానికి అవకాశం ఉంది.
దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాలకు ఈ సౌకర్యం లేదు. ఉదాహరణకు ముంబై నగరానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది ముంబై నగరం అభివృద్ధి చెదగాలంటే కేవలం నవీన్ ముంబై మాత్రమే దిక్కుగా ఉంది. ఇక చెన్నై నగరానికి చూసినట్లయితే, అక్కడ కూడా ఒక వైపు సముద్రం మరోవైపు ఆంధ్రప్రదేశ్ బోర్డర్, ఇలా భౌగోళికంగా అంతగా అనుకూలమైన పరిస్థితిలో లేదు.
ఇక బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే బెంగళూరులో కేవలం ఒకవైపు మాత్రమే విస్తరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బెంగుళూరు నగరం అటు తూర్పు వైపున తమిళనాడు స్టేట్ బోర్డర్, ఉత్తరాన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అడ్డంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే నాలుగు వైపులా వేగంగా విస్తరించేందుకు అవకాశం ఉంది. అంతే కదా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి దీంతో అభివృద్ధి పనులు జరిగేందుకు పరిశ్రమలకు భూములను కేటాయించేందుకు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ఇక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ధరలతోపాటు విల్లాస్, ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో చదరపు గజం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఒక వేలంపాటలో మూడు లక్షల వరకు పలికింది అంటే హైదరాబాద్ నగరంలో భూముల విలువ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల ధర కనీసం చదరపు గజం లక్ష రూపాయలకు వరకు ఉంది అంటే ఆశ్చర్య పోవడం ఖాయం. అయితే హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో ఉన్న విజయవాడ హైవే భవిష్యత్తులో భారీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హయత్ నగర్ మండలం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతం గుండా వెళ్లడం ద్వారా ఔటర్ చుట్టుపక్కల కాలనీలు వెలుస్తున్నాయి. ఈ కాలనీల్లో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు 50 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు ఇండిపెండెంట్ లభిస్తున్నాయి. మీరు బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ఈ ప్రాంతంలో వెరిఫై చేసుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్నటువంటి సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. . మీ పెట్టుబడులకు లాభనష్టాలకు మేము ఎలాంటి బాధ్యత వహించము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









