)
ICICI Minimum Balance Charges: ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే ఖాతాదారులు కచ్చితంగా రూ. 50 వేలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని బ్యాంకులు కూడా పొదుపు ఖాతాల్లో మినిమం బాలన్స్ లేనిపక్షంలో అపరాధ రుసుమును విధిస్తున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తుంది. పొదుపు ఖాతాలో కనీస నిల్వ మొత్తాన్ని ఒక్కసారిగా పెంచేసింది. ఈ క్రమంలో గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులతో సహా మెట్రో, అర్బన్, సెమీ అర్బన్ వంటి అకౌంట్స్ లపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1వ తర్వాత సేవింగ్స్ ఖాతా తెరిచిన కస్టమర్లు అందరికి వర్తించనున్నట్లు ప్రకటించింది.
ఐసీఐసీఐ బ్యాంకు కొత్తగా విధించిన నిబంధనలను ప్రకారం.. మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్ తీసుకునేవారు తమ ఖాతాలో కనీసం 50 వేల రూపాయలను నిల్వ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితిని 10,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు దాని ఏకంగా ఐదు రెట్లు పెంచేశారు. సెమీ అర్బన్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ మొత్తాన్ని రూ. 5,000 నుంచి రూ. 25,0000 కు పెంచారు. అలాగే గ్రామీణ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ రూ. 2,500 నుంచి రూ. 10,000 పెంచేశారు. ఈ విషయాన్ని తమ ఖాతాదారులు అందరూ తప్పనిసరిగా పాటించాలని నిబంధనల ప్రకారం మినిమం బాలన్స్ రూల్స్ ను పాటించకపోతే అపరాధ రుసుములు కట్టాల్సి వస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.
అయితే ప్రస్తుతం దేశీయ బ్యాంకులు తమ పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్న కనీస సగటు నిల్వ మొత్తం నిబంధనలో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని పెట్టడం గమనార్హం. మార్కెట్లో ఇతర బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ (HDFC) లో గరిష్టంగా రూ. 10,000 కనీస నగదు నిబంధన ఉండగా యాక్సిస్ బ్యాంకులో రూ. 12,000 ఉంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఆయా కస్టమర్ల నుంచి సదరు బ్యాంకులు ఛార్జీలు వస్తువులు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఇలాంటి అపరాధ రుసుములు వసూలు చేయకుండా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను మినహాయింపు ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఎస్బీఐ (SBI) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2020 లోనే ఈ అపరాధ రుసుము నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఈ మినిమం బాలన్స్ ఛార్జీలను తొలగించాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook