ICICI Prudential Equity and Debt Fund: సంపద స్రుష్టిలో కాంపౌండింగ్ అనేది కీ సీక్రెట్ అని చెప్పవచ్చు. అవును కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. దీన్ని ప్రపంచపు 8వ వింతగా అభివర్ణించారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్. దీన్ని అర్థం చేసుకున్న వారు సంపాదిస్తారని..అర్థం కాకుంటే చెల్లించుకుంటారని అన్నారు. ఈ కాలపు దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ కూడా ఇదే సూత్రం పాటిస్తుంటారు. అంటే మీరు ఒక స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్ లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టినట్లయితే కొన్నేళ్ళ పాటు అలాగే కొనసాగించినట్లయితే ఇక్కడ కాలం గడుస్తున్న కొద్దీ ఆరంభ సంవత్సరాల్లో కంటే తర్వాత సంవత్సరాల్లో సంపద ఊహించని విధంగా పెరుగుతుంది. దీనినే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అంటారు.
అంటే ఇక్కడ మొదటి సంవత్సరం రిటర్న్స్ రెండో ఏడాదిలో అసలుకు కలిపి దానిపై వడ్డీ లభిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం సంపద వృద్ధి చెందుతుంది. ఇదే కాంపౌండింగ్ పవర్ అని చెప్పవచ్చు. అయితే ఈ కాంపౌండింగ్ బెనిఫిట్ గురించి తెలియాలంటే మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో రిటర్న్స్ గురించి తెలుసుకోవాలి. అలాంటి ఒక అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్. 1999లో ఇది లాంచ్ అవ్వగా..అప్పటి నుంచి అద్భుతస్థాయిలో లాభాలను అందించింది.
Also Read: Today Gold Rate: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు..రూ. 1,500పెరిగిన వెండి.. బంగారం ఎంత పెరిగిందంటే?
ఇక్కడ ఏడాది వ్యవధిలో అంటే వార్షిక ప్రాతిపదికన 12.81 శాతం సగటు రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో రూ. లక్ష పెట్టుబడిని రూ.1.12లక్షలు చేసింది. అదే విధంగా మూడేళ్లలో చూసినట్లయితే 17.08శాతం సగటు రిటర్న్స్ చొప్పున రూ. లక్ష ఇన్వెస్ట్ మెంట్ ను రూ. 1.60 లక్షలుగా చేసింది. ఇంకా ఐదేళ్ల కాలంలో 21.13 శాతం సగటు రాబడి రాగా లక్షను రూ. 2.60 లక్షలుగా చేసింది. 10ఏళ్లలో అదే రూ. లక్షల రూ. 3.66 లక్షలు అయ్యింది. ఇక ఈ పథకం ప్రారంభం నుంచి చూస్తే అంటే ఈ25ఏళ్ల కాలంలో రూ. లక్ష పెట్టుబడిపై రూ. 36.14లక్షలు వచ్చాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ కంటే దీర్ఘకాలంలో లాభాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్ధం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









