Trump Tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌లు.. ఈ భారతీయ ఫార్మా కంపెనీలకు చావు దెబ్బ తప్పదా?

US Tariff on Pharma: ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించే ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. దీంతో భారత మార్కెట్లు మరోసారి కరెక్షన్స్ కు లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రంప్ టారీఫ్స్ ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ప్రతి ఏడాది 8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ట్రంప్ సుంకాల విధింపు  కారణంగా భారతీయ ఔషధ కంపెనీల షేర్లు భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది.   

Written by - Bhoomi | Last Updated : Apr 1, 2025, 05:01 PM IST
Trump Tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌లు.. ఈ భారతీయ ఫార్మా కంపెనీలకు చావు దెబ్బ తప్పదా?

 US Tariff on Pharma:  అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విధించే ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ట్రంప్ టారీఫ్స్ భారత ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని ట్రంప్  ప్రకటించిన తర్వాత భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం భారత మందులపై అమెరికా ఎటువంటి సుంకం విధించడం లేదు. అమెరికాలోని ఔషధాల్లో ఎక్కువ భాగాన్ని భారతీయ ఔషధ కంపెనీలు సరఫరా చేస్తాయి. 2022 సంవత్సరంలో అమెరికాలోని వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లలో 40 శాతం లేదా 10శాతంలో నాలుగు భారతీయ కంపెనీలే సరఫరా చేశాయి. ఈ భారతీయ కంపెనీల మందులు 2022లో అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లను ఆదా చేసాయి.  2013, 2022 మధ్య మొత్తం 1,300 బిలియన్ల డాలర్లను ఆదా చేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతదేశ ఔషధ పరిశ్రమ ప్రస్తుతం అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. అమెరికా మొత్తం ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. 

Add Zee News as a Preferred Source

సుంకాలు విధించడం ద్వారా అమెరికా.. తన దేశీయ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికన్ వినియోగదారులపై భారాన్ని మరింత మోపుతుంది. అంతేకాదు వారికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకుండా చేస్తుంది. అమెరికా తన దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి ఔషధ ఉత్పత్తులను నికర దిగుమతి చేసుకుంటోంది. పరిమిత సరఫరా కారణంగా ఔషధాలపై 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలు విధించడం కష్టంగా మారుతుంది.

Also Read: Reciprocal Tariff: ట్రంప్ టారీఫ్.. అమెరికాతో సహా ఏ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అందులో భారత్ ఉందా?  

ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే, అది భారత కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ ఔషధ కంపెనీల మెరుగైన వ్యయ పోటీతత్వమే దీనికి కారణం. దీంతో భారతీయ కంపెనీలు తమ ప్రపంచ పోటీదారులతో పోలిస్తే అమెరికా మార్కెట్లో ఎక్కువ మార్కెట్ వాటాను పొందగలవు. బ్రోకరేజ్ సంస్థ ప్రకారం 10శాతం సుంకం విధించినప్పటికీ దానిలో ఎక్కువ భాగం వినియోగదారులకు బదిలీ అవుతుంది. ఎందుకంటే మందులకు సాధారణ డిమాండ్ అలాగే ఉంటుంది. జెపి మోర్గాన్ ప్రకారం అమెరికాలో జనరిక్ ఔషధాలను అమ్మే ఇజ్రాయెల్,  స్విస్ కంపెనీలు భారతీయ కంపెనీల కంటే తక్కువ లాభాలతో పనిచేస్తాయి.  కాబట్టి అవి సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి.

అయితే భారత ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 31శాతంగా ఉంది. సుంకాలతో భారత ఔషధాలు అమెరికా మార్కెట్లో మరింత ఖరీదుగా మారుతాయి. దీంతో ఎగుమతులు పడిపోయే అవకాశం కూడా  ఉంటుంది.  ప్రత్యేకించి జనరిక్ మెడిసిన్స్ లాభదాయకత పోయే ప్రమాదం ఉంది. అమెరికా టారిఫ్ ప్రతిపాదనల వల్ల భారత్ కు విదేశీ మారకద్రవ్య ఆదాయం తగ్గిపోతుంది. తయారీ, పరిశోధన, పంపిణీలో లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక విధంగా భారత ఫార్మా కంపెనీలపై సుంకాలు విధిస్తే అది భారత్ కంటే  అమెరికాకే తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఈ ఔషధాలను తయారు చేసేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటే  దాదాపు 5 నుంచి 6సంవత్సరాల ప్రక్రియ. అంతేకాదు భారీ ఖర్చుతో కూడుకున్నది. కానీ భారత్ లోని సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్లాండ్ ఫార్మా, ఇండియాన్ ఫార్మా, లుపిన్ కంపెనీలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News