)
ITR Deadline Extension 2025: 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) గడువు విషయంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ గడువు సెప్టెంబర్ 15, 2025 వరకే ఉంది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తూ అదనంగా ఒక రోజు సమయం ఇచ్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు సెప్టెంబర్ 16, 2025 వరకు ITR ఫైలింగ్ చేయడానికి ఛాన్స్ లభించినట్లయ్యింది. దీనితో చివరి రోజుల్లో వెబ్సైట్ ట్రాఫిక్ ఎక్కువవడం, టెక్నికల్ ఇబ్బందులు ఎదురవ్వడం వంటి సమస్యల కారణంగా ఇబ్బందిపడిన వారికి ఈ పొడిగింపు బిగ్ రిలీఫ్ గా మారిందని చెప్పవచ్చు.
CBDT స్పష్టంగా చెప్పింది ఏమిటంటే.. ఈ అదనపు సమయాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకుని ఎటువంటి తొందరపాటు లేకుండా గడువులోపే తమ రిటర్న్‌లను దాఖలు చేయాలని పేర్కొంది. అలాగే, ఎలాంటి రూమర్స్ లేదా ఫేక్ వార్తలపై ఆధారపడకుండా కేవలం అధికారిక @IncomeTaxIndia అప్డేట్స్ను మాత్రమే నమ్మాలని సూచించింది. టాక్స్ ఫైలింగ్, పన్ను చెల్లింపులు, రీఫండ్లు వంటి సర్వీసులకు సహాయం చేయడానికి హెల్ప్‌డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని.. ఇది కాల్స్, లైవ్ చాట్, వెబెక్స్ సెషన్లు, ట్విట్టర్/ఎక్స్ ద్వారా కూడా సహాయం చేస్తుందని తెలిపింది.
సకాలంలో ITR దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఆలస్యమైతే రూ.5,000 జరిమానా లేదా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా రీఫండ్ ఆలస్యం కావచ్చు. కొన్ని మినహాయింపులు లేదా తగ్గింపులు అందుబాటులో ఉండకపోవచ్చు. అదే సమయంలో సకాలంలో రిటర్న్ ఫైల్ చేయడం వలన రీఫండ్ వేగంగా వస్తుంది. అదనంగా ITR అనేది ఆదాయ రుజువు కాబట్టి లోన్లు, వీసాలు, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
సెప్టెంబర్ 16 కొత్త గడువులోపల కూడా ITR దాఖలు చేయకపోతే, జరిమానా, వడ్డీ, ఆర్థిక నష్టం తప్పవని CBDT హెచ్చరించింది. అందుకే పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా గడువులోపే రిటర్న్ ఫైల్ చేసి అనవసరమైన ఖర్చులను తప్పించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా చివరి రోజు పెద్దెత్తున యూజర్లు తమ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సర్వర్ల లోపాలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 48 గంటల్లో ఫైలింగ్ ప్రక్రియలో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా టాక్స్ ఫైలింగ్స్ నిలిచిపోయాయి. దీంతో స్పందించిన ఐటీ విభాగం బ్రౌజర్ సమస్యలను పరిష్కరించేందుకు యూజర్లకు కొన్ని సూచనలు ఇచ్చినప్పటీ పరిష్కారం కాలేదు. దీంతో గడువును పొడిగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.