)
ITR Filing Deadline Extension: భారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితిని దాటిన ప్రతి ఒక్కరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడం తప్పనిసరి. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31 వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈసారి కేంద్రం ఆ గడువును పొడిగించి సెప్టెంబర్ 15 వరకు అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ రోజుతోనే ఆ గడువు ముగుస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో "ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు" అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. ఆ ప్రచారం మొత్తం ఫేక్ న్యూస్ అని ఖండించింది. ఇప్పటికే గడువు జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించామని, ఇకపై మరింత పొడిగింపు ఉండదని టాక్స్‌పేయర్లకు క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల మంది టాక్స్‌పేయర్లు రిటర్న్స్ ఫైల్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అందులో 5.51 కోట్ల మంది ఇ-వెరిఫై పూర్తి చేశారు. అలాగే 3.78 కోట్ల రిటర్న్స్ ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. అయినప్పటికీ, ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయని వారు ఆలస్యం చేయకుండా ఇవాళ్టిలోపే పూర్తి చేయాలని సూచించింది. పన్ను చెల్లించాల్సిన ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన పాత పన్ను విధానం (Old Regime) లేదా కొత్త పన్ను విధానం (New Regime) ఎంచుకుని రిటర్న్స్ ఫైల్ చేయాలని సలహా ఇచ్చింది.
ఐటీఆర్ గడువు ఇవాళ్టితో ముగిసినప్పటికీ, డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా ఫైలింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ సందర్భంలో జరిమానా తప్పనిసరి. రూ. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు రూ. 5,000 జరిమానా చెల్లించాలి. రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జరిమానా రూ.1,000 మాత్రమే. కృత్రిమంగా ఖర్చులు చూపించి లేదా తప్పుడు వివరాలతో రిఫండ్ పొందే ప్రయత్నం చేయడం నేరం అని ఐటీ శాఖ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో నోటీసులు, జరిమానాలు, ఇతర ఇబ్బందులకు దారితీయవచ్చని చెప్పింది.
అలాగే టాక్స్‌పేయర్లకు సహాయం అందించడానికి ఆదాయపు పన్ను శాఖ 24x7 హెల్ప్‌లైన్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, కాల్స్, ఇమెయిల్స్ ద్వారా సేవలను అందుబాటులో ఉంచింది. అధికారిక వెబ్సైట్, అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే అప్డేట్స్ను నమ్మాలని సూచించింది. మొత్తం మీద, పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత మాత్రమే కాకుండా, భవిష్యత్తులో లోన్లు తీసుకోవడంలో, వీసా ప్రాసెస్‌లో, ఆర్థిక లావాదేవీలలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా గడువు ముగిసేలోపే ఐటీఆర్ ఫైల్ చేయాలి. సెప్టెంబర్ 15 చివరి తేదీ కాబట్టి ఇంకా చేయని వారు వెంటనే పూర్తి చేయడం అత్యంత అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.