IT Returns: ఐటీ రిటర్న్స్ మిస్ అయ్యారా..డిసెంబర్ 31 వరకూ గడువు మిగిలుంది, ఫైన్ ఎంతంటే

IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలుకు సమయం మించిపోయింది. ఇప్పుడిక మిగిలింది జరిమానాతో మాత్రమే. అయినా తప్పకుండా దాఖలు చేయాల్సిందే. ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో ఈ పొరపాట్లు చేస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2023, 09:29 PM IST
IT Returns: ఐటీ రిటర్న్స్ మిస్ అయ్యారా..డిసెంబర్ 31 వరకూ గడువు మిగిలుంది, ఫైన్ ఎంతంటే

IT Returns: ఆదాయపు పన్ను శాఖ విషయంలో ట్యాక్స్ పేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2022-23 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం మించిపోయింది. జూలై 31తో గడువు ముగిసిపోవడంతో ఇప్పుడిక పెనాల్టీతో మరో గడువు ఉంది. అది డిసెంబర్ 31. 

ఐటీ రిట్నర్స్ దాఖలు చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ట్యాక్స్ పరిధిలో వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ప్రతి యేటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యగా మారవచ్చు. జూలై 31 నాటికి కోట్లాదిమంది ఇప్పటికే ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇంకా చాలామంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఇన్‌కంటాక్స్ నిబంధనల ప్రకారం ఏడాదికి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 5000 పెనాల్టీతో డిసెంబర్ 31లోగా రిటర్న్స్ పైల్ చేయాలి. అదే  5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే్ డిసెంబర్ 31లోగా 1000 రూపాయల జరిమానాతో రిటర్న్స్ పైల్ చేయాలి.

డిసెంబర్ 31లోగా కూడా రిటర్న్స్ దాఖలు చేయకపోతే పెనాల్టీ పెరగడమే కాకుండా చట్టరీత్యా నేరమౌతుంది. అదే సమయంలో ఏడాది కాలంలో ఏ ఆదాయాన్ని మిస్ కాకుండా రిటర్న్స్‌లో చూపించాలి. రిటర్న్స్ లో చూపించిన ఆదాయం కంటే ఎక్కువ ఉన్నట్టు తేలితే చట్టరీత్యా శిక్షార్హులౌతారు. అందుకే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి రిటర్న్స్ దాఖలు చేయడం అన్ని విధాలా మంచిది.

మొత్తం 6.24 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇప్పటికే చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇప్పటికే రిటర్న్స్ పైల్ చేసుంటే అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోండి. రిటర్న్స్‌లో తప్పుులు దొర్లితే ఐటీ నుంచి నోటీసులు రావచ్చు. పాన్ నెంబర్, ఐటీఆర్ స్పెల్లింగ్ తేడా, చలాన్ నెంబర్ రాంగ్ అసెస్‌మెంట్ , టీడీఎస్, ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్‌లో తేడాలుండవచ్చు. ఆదాయం, టీడీఎస్ మధ్య బ్యాలెన్స్ , ట్యాక్స్ ఆడిట్ లేకుండా ట్యాక్స్ పేమెంట్ వంటిని ఐటీఆర్ తప్పులుగా పరిగణిస్తారు.  ఇలాంటి తప్పుల్ని సరిచేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇన్‌కంటాక్స్ శాఖ. దీనికోసం రెక్టిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఐటీఆర్ డిఫెక్టివ్ అని తేలితే అసెస్‌మెంట్ సంవత్సరంలో గడువు ఇంకా ముగియకపోతే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి రివైజ్డ్, రెండవది కొత్తగా మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేయడం. పెనాల్టీ డెడ్‌లైన్ కూడా ముగిస్తే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Cheque Signature Rules: చెక్ జారీ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని 10 తప్పులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News