Stock Market : ఆగస్టు 15 సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు..మళ్లీ ట్రేడింగ్ ఎప్పుడంటే..?
Stock Market Independence Day 2024 : ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు రేపు మూసి ఉంటాయి. ఎలాంటి ట్రేడింగ్ ఆక్టివిటీ చోటు చేసుకోదు. అదే సమయంలో బ్యాంకులకు కూడా రేపు సెలవు. కానీ ఆన్ లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.
Independence Day stock market : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం అంటే ఆగస్టు 15న భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు దినం. అంటే ఈ రోజు ట్రేడింగ్ జరగదు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండూ మూసివేయబడతాయి. ఈక్విటీ, డెరివేటివ్‌లు సెక్యూరిటీల లెండింగ్ బారోయింగ్ (SLB)తో సహా అన్ని మార్కెట్ విభాగాలు ఈ రోజున మూసివేసి ఉంటాయి. ఇది కాకుండా, కమోడిటీ మార్కెట్ కూడా ఆగస్టు 15 న రోజంతా మూసివేసి ఉంటాయి. కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) సెగ్మెంట్ BSEలో మూసివేసి ఉంటాయి.
MCXలో ట్రేడింగ్ మూసివేసి ఉంటుంది:
దీంతో పాటు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX)లో అన్ని బులియన్, మెటల్ ఎనర్జీ డెరివేటివ్స్ ట్రేడింగ్ ఉదయం సాయంత్రం రెండు సెషన్ల పాటు మూసివేసి ఉంటుంది. అదే సమయంలో, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX)లో అగ్రి-కమోడిటీల ట్రేడింగ్ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూసివేసి ఉంటుంది.
Also Read : Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
ఈ ఏడాది 15 సెలవులు:
భారత స్టాక్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ శుక్రవారం, ఆగస్టు 16 నుండి తిరిగి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ నెలలో ఇతర స్టాక్ మార్కెట్ సెలవులు లేవు. తదుపరి ట్రేడింగ్ సెలవుదినం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 బుధవారం. 2024 క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 15 స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరం మిగిలిన ట్రేడింగ్ సెలవులు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, నవంబర్ 1న దీపావళి, నవంబర్ 15న గురునానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్ అని గుర్తుంచుకోండి.
బ్యాంకులకు సెలవు:
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం. అందువల్ల అన్ని బ్యాంకులు మూసివేసి ఉంటాయి. అయితే, అన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!
ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం తెరిచి ఉంటాయి. ముఖ్యంగా యూరప్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు, ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్ జరుగుతుంది. వీటి ప్రభావం శుక్రవారం మన మార్కెట్ల పై పడే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే ప్రస్తుతం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.అమెరికాలోని నాస్డాక్, ఎస్ అండ్ పీ సూచీలు సైతం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక దేశీయ మార్కెట్లలో బుధవారం గమనించినట్లయితే, నిఫ్టీ ఫ్లాట్ గా ముగిసింది. అలాగే సెన్సెక్స్ కూడా ఫ్లాట్ గా ముగిసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook