India-Pak: దెబ్బపై దెబ్బ.. పాకిస్తాన్ కి ప్యాంట్ తడిచిపోయిందిగా.. ఆ మొత్తాన్ని బ్యాన్ చేసిన భారత్

India-Pak: పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై భారత్ నిషేధం విధించింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇది పెద్ద దెబ్బ . జాతీయ భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. రోజురోజుకు రెండు దేశాల మధ్య సంబంధాలు క్షిణిస్తున్నాయి.   

Written by - Bhoomi | Last Updated : May 3, 2025, 11:14 PM IST
India-Pak: దెబ్బపై దెబ్బ.. పాకిస్తాన్ కి ప్యాంట్ తడిచిపోయిందిగా.. ఆ మొత్తాన్ని బ్యాన్ చేసిన భారత్

India-Pak: దాయాది దేశం పాకిస్తాన్ కు భారీ షాకిచ్చింది భారత్. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై నిషేధం విధించింది భారత్. పాకిస్తాన్ నుంచి లేదా పాకిస్తాన్ దేశం మీదుగా వచ్చే అన్ని వస్తువులపై ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని భారత విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ మే 2న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పొరుగుదేశానికి ఇది భారీ దెబ్బ అనే చెప్పవచ్చు. 

Add Zee News as a Preferred Source

డీజీఎఫ్ టీ ఆదేశాల ప్రకారం ఇకపై పాకిస్తాన్ నుంచి నేరుగా లేదా పరీక్షంగా వచ్చే అన్ని వస్తువులపై ఈ నిషేధం అమల్లో ఉంటుంది. జాతీయ భద్రత ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ తెలిపింది. ఒకవేళ ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలనుకుంటే  ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. 

2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు భారత్ నుంచి పాకిస్తాన్ ఎగుమతులు 447.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్ కు దిగుమతులు 4,20,000డాలర్లకు తగ్గగా... గతేడాది ఇదే కాలంలో చూస్తే ఎగుమతులు 1.1 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 2.86 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎగుమతులు, దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. తాజా నిషేధంలో పూర్తిగా పడిపోతాయి. ఈ నిషేధం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందో తెలియదు. 

Also Read: Mutual Funds: ఇన్వెస్టర్లు కోటీశ్వరులు చేసిన మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..5ఏళ్లలో 38శాతం వరకు బంపర్ రాబడి    

భారత్ నుంచి పాక్ కు పత్తి, సేంద్రీయ రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు, ఔషధాలు, టీ, కాఫీ, సుగంధ్ర ద్రవ్యాలు మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. పాకిస్తాన్  నుంచి భారత్ కు రాగి, పండ్లు, పత్తి, సల్ఫర్, ఉప్పు, ఖనిజ ఇంధనాలు, ప్లాస్టిక్, గాజు సామాన్లు, తోళ్లు మొదలైనవి దిగుమతి అవుతుంటాయి. తాజా ఆంక్షలతో వీటిపై తీవ్ర ప్రభావం పడనుంది. 

Also Read: ITR filing: ఐటీఆర్ సమర్పించే సమయం ఆసన్నమైంది.. ఈ మార్పులు గమనించకుంటే నష్టపోతారంతే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News