India-Pakistan: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం కూడా నెలకొంటుంది. పహల్గాం ఉగ్రదాడికి స్పందనగా భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పైన అనేక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో అన్ని రకాలుగా వాణిజ్య, విదేశాంగ ఒప్పందాలనుంచి బయటకు వస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత కారణంగా కుంకుమపువ్వు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఒక కేజీ కుంకుమ ధర ఏకంగా ఐదు లక్షల రూపాయలు పైగా పలుకుతోంది. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
భారతదేశంలో దాదాపు ప్రతి ఏడాది 55 టన్నుల కుంకుమపువ్వు వినియోగం అవుతుంది. వీటిని రకరకాలుగా ఉపయోగిస్తారు అదేవిధంగా కుంకుమ పువ్వును వంటకాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ప్రపంచంలోనే అత్యంత సుగంధ ద్రవ్యంగా కుంకుమపువ్వు పేరుంది. అయితే కుంకుమపువ్వు భారత దేశంలో కాశ్మీర్ రాష్ట్రంలోనే అత్యధికంగా పండుతుంది. అయితే మన దేశీ అవసరాలకు ఇది సరిపోదు కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం
అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ సరిహద్దులను పూర్తిస్థాయిలో మూసివేశారు. ఇరుదేశాల మధ్య అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలు నిలిపివేశారు. పాకిస్తాన్ భారత్ లను కలిపే అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా వస్తు రవాణా నిలిపివేయడంతో ఆఫ్గానిస్తాన్ నుంచి రావాల్సిన కుంకుమపువ్వు దిగుమతులు దాదాపు నిలిచపోయాయి. దీంతో కుంకుమపువ్వు ధర ఒక కిలో రూ.5 లక్షల వరకూ పెరిగింది. నిజానికి ధరల పెరుగుదలనేది కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 10 శాతం పెరిగినట్లు గమనించవచ్చు. ఇక ఇరాన్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమపువ్వు పైన కూడా ఐదు శాతం ధరలు పెరిగాయి.
Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే
కుంకుమ పువ్వులో మూడు రకాలు ఉంటాయి. మొదటిది మోంగ్రా (కాశ్మీరీ) – గాఢమైన ఎరుపు, అధిక ధర, ఉత్తమ రుచి కలిగి ఉంటుంది. అలాగే రెండో రకం లచ్చా (కాశ్మీరీ) – తక్కువ శక్తితో, మధ్యస్థ రకంగా ,చెప్పవరచ్చు. పుషాల్ (ఆఫ్గాన్, ఇరాన్) – పసుపు రంగులో ఉంటుంది. మన దేశంలో అతి త్వరలోనే పెళ్లిల సీజన్ ప్రారంభం కానుంది పెళ్లిళ్ల సీజన్లో ఎక్కువగా వంటకాల్లోనూ అదే విధంగా సాంప్రదాయ క్రతువుల్లోనూ కుంకుమపువ్వు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం సప్లై తగ్గిపోవడం వల్ల ధర భారీగా పెరిగింది భవిష్యత్తులో కూడా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్త అంచనా వేస్తున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య బంధాలు ఇప్పట్లో సామాన్య స్థితికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కనుక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మన దేశంలోకి కుంకుమపువ్వును దిగుమతి చేసుకునేందుకు వ్యాపారవేత్తలు ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ మార్గం ద్వారా దిగుమతి చేసుకోవడం సులువు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









