Digital services at post offices: పోస్టాఫీస్ వినియోగదారలుకు గుడ్ న్యూస్. ఆగస్టు నెల నుండి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసు కౌంటర్లలో ఆన్‌లైన్ చెల్లింపులు జరగనున్నాయి. పీటీఐ తెలిపిన వార్తల ప్రకారం, ఇండియా పోస్ట్ తన ఐటీ వ్యవస్థలో కొత్త అప్లికేషన్‌ను అమలు చేయడం పూర్తయిన తర్వాత ఆగస్టు నుండి కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను చేడయం ప్రారంభించాలని నిర్ణయించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
పోస్టాఫీసుల ఖాతాలు UPI (యూనిక్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) వ్యవస్థతో సమకాలీకరించకపోవడంతో.. అవి ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను అంగీకరించలేకపోతున్నాయి. డైనమిక్ QR కోడ్‌లతో లావాదేవీలు నిర్వహించగల కొత్త అప్లికేషన్‌లను కలిగి ఉండే దాని IT మౌలిక సదుపాయాలను పోస్టల్ శాఖ అమలు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2025 నాటికి అన్ని పోస్టాఫీసులలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
ఐటీ 2.0 కింద ఈ వ్యవస్థ పైలట్ రోల్ అవుట్ కర్ణాటక సర్కిల్‌లో ప్రారంభించింది. మైసూర్ ప్రధాన కార్యాలయం, బాగల్‌కోట్ ప్రధాన కార్యాలయం, దాని అనుబంధ కార్యాలయాలలో మెయిల్ ఉత్పత్తుల QR- ఆధారిత బుకింగ్ విజయవంతంగా జరిగింది. డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి పోస్టల్ శాఖ ప్రారంభంలో పోస్టాఫీసులలోని సేల్స్ కౌంటర్లలో స్టాటిక్ QR కోడ్‌లను ప్రవేశపెట్టింది. కానీ తరచుగా సాంకేతిక సమస్యలు, కస్టమర్ ఫిర్యాదుల కారణంగా దీన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
భారత్ లో 1.5 లక్షల గ్రామీణ పోస్టాఫీసులతో ఒక పెద్ద లాజిస్టిక్స్ సంస్థగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పోస్టాఫీసులు పెద్ద పరివర్తనకు గురయ్యాయి. గ్రామీణ భారతదేశంలోని సమాజాలను, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా చేర్చడానికి వాటిని వెన్నెముకగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం, సగటున మహిళలు జాతీయ బ్యాంకుల్లో 20 శాతం ఖాతాలను కలిగి ఉండగా, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించినప్పటి నుండి, తెరిచిన ఖాతాలలో 45 శాతానికి పైగా మహిళలే కలిగి ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









