Pahalgam Terror Attack: భారత్ - పాక్ ఉద్రిక్తతతో.. మనదేశంలో కూడా వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. లిస్ట్ ఇదే

Pahalgam Terror Attack: ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. అనేక మంది గాయపడ్డారు. పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత.. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో వాణిజ్య యుద్ధం జరిగితే భారత్ కు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలుసుకుందాం 

Written by - Bhoomi | Last Updated : Apr 25, 2025, 12:34 PM IST
Pahalgam Terror Attack: భారత్ - పాక్ ఉద్రిక్తతతో.. మనదేశంలో కూడా వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. లిస్ట్ ఇదే

Pahalgam Terror Attack: ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. అనేక మంది గాయపడ్డారు. పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత.. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై చర్యలు తీసుకుంది. పహల్గామ్ దాడి అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతోపాటు భారత ప్రభుత్వం పాకిస్థానీ పౌరులకు సార్క్ వీసాలను కూడా రద్దు చేసింది. SAVES వీసాలు ఉన్నా..ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాక్ పౌరులకు కూడా ప్రభుత్వం తెలిపింది. 48గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇదేగాకుండా పాకిస్తాన్ అధికారిక ఎక్స్ అకౌంట్ ను కూడా భారత్ బ్యాన్ చేసింది. 

Add Zee News as a Preferred Source

పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాల తర్వాత దాని ప్రభావం భారత్, పాక్ మధ్య వాణిజ్యంపై కనిపిస్తుంది. భారత్, పాక్ మధ్య పెద్దెత్తున వాణిజ్యం ఉంది. అలాంటి సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు క్షీణించినప్పుడు బారత్ లోని అనేక విషయాలు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. భారత్, పాక్ నుంచి పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తుంటారు. భారతీయ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో పాక్ తో వాణిజ్యం మూసివేయడంతో భారతదేశంలో డ్రైఫ్రూట్స్ ధరల్లో మార్పు ఉండవచ్చు. దీంతో డ్రైఫ్రూట్స్ ఖరీదైనవి మారవచ్చు. 

Also Read: IAS Success Story: మొబైల్ ముట్టుకోలేదు...భగవద్గీతనే నమ్ముకున్నా.. సివిల్స్ 11వ ర్యాంక్ సాయి శివాని సక్సెస్ సీక్రెట్ ఇదే  

డ్రైఫ్రూట్స్ తోపాటు పెద్ద మొత్తంలో సింధు ఉప్పును కూడా కొనుగోలు చేస్తుంటారు. భారత్ లో సింధు లోయ ఉప్పు పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో సింధు ఉప్పు అత్యధిక పరిమాణంలో లభించే దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. అందుకే సింధు ఉప్పు భారత్ లో అత్యంత ఖరీదైనదిగా మారవచ్చు. 

భారత్ లో కళ్ళద్దాల్లో ఉపయోగించే ఆప్టికల్ లెన్స్ లను కూడా పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్ లెన్స్ లను కూడా పాక్ నుంచి కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్ కు భారతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాకిస్తాన్ తో సంబంధాలు ముగిసిన తర్వాత భారత్ లో ఆప్టికల్ లెన్స్ కూడా ఖరీదైనవిగా మారుతాయి. 

Also Read: Stock Market:  షేర్ మార్కెట్ పై పహల్గామ్ దాడి ప్రభావం.. సెన్సెక్స్, నిఫ్టీలో భారీ పతనం   

వీటన్నింటితోపాటు భారత్, పాక్ నుంచి పండ్లు, సిమెంట్, ముల్తానీ మట్టి, పత్తి, ఉక్కు, తోలు వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటుంది. భారత్ అన్ని ఉత్పత్తులు పాక్ నుంచి పెద్ద మొత్తంలో వస్తాయి. కానీ ఇప్పుడు భారత్, పాక్ మధ్య వాణిజ్యంలో మార్పు ఉంటుంది. దీని వల్ల ఈ వస్తువులన్నీ కూడా ఖరీదైనవిగా మారుతాయి.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News