Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్ .. ఆర్ధిక సంవత్సరం మొదటి రోజే భారీ పతనం..

Stock Markets: 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా టారిఫ్‌ల భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2025, 01:13 PM IST
Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్ .. ఆర్ధిక సంవత్సరం మొదటి రోజే భారీ పతనం..

Stock Markets: ఏదైతే జరగకూడదని అనుకున్నామో అది జరిగింది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదటి రోజే.. స్టాక్ మార్కెట్లు భయపెట్టాయి.  సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ 23,300 మార్క్‌ దిగువకు పడిపోయింది. ప్రధాన షేరల్లో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌  1161 పాయింట్ల నష్టంతో 76,253 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 23,231 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, జొమాటో, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. మొత్తంగా అమెరికా మన దేశంపై విధించే దిగుమతి సుంకాల నేపథ్యంలో ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ డే నే నష్టాలతో ప్రారంభం కావడం గమనార్హం. 

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News