)
IndiGo Grand Runway Fest: దేశీయ దిగ్గజ విమానయాన సంస్థల్లో ఒక్కటైన ఇండిగో ఎయిర్ లైన్స్ మరోసారి స్పెషల్ సేల్ తీసుకువచ్చింది. కేవలం రూ. 1299కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. రూ. 4599కి అంతర్జాతీయ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఛార్జీలు వర్తిస్తాయి. ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఆఫర్ కొద్దికాలం మాత్రమే ఉండటం వల్ల ప్రయాణికులు వెంటనే బుకింగ్ చేసుకోవడం మంచిది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇండిగో ప్రకటించిన ఈ ప్రత్యేక పథకం వన్-వే బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే రౌండ్-ట్రిప్ టికెట్ బుక్ చేసుకుంటే ఈ తగ్గింపును పొందలేరు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ లేదా ఇతర ఎయిర్‌లైన్స్ నిర్వహించే విమానాలకు ఈ సౌకర్యం ఉండదు.
ఈ గ్రాండ్ రన్‌వే ఫెస్ట్ ఆఫర్ కింద, సెప్టెంబర్ 15, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు బుకింగ్‌లు చేయవచ్చు. ఒకసారి బుకింగ్ చేసుకున్న తర్వాత, ప్రయాణం కోసం సమయం కూడా చక్కగా ఉంది. అంటే, జనవరి 7, 2026 నుంచి మార్చి 31, 2026 వరకు ఎప్పుడైనా ఈ తగ్గింపు ధరల్లో ప్రయాణించవచ్చు. దీని వలన సెలవులు, పండుగలు లేదా వ్యాపార పనుల కోసం ముందుగానే ప్రయాణం ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశం.
ధరల విషయానికి వస్తే, దేశీయ ప్రయాణాల కోసం ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1299 నుంచి నుంచి ప్రారంభమవుతాయి. అంతే కాకుండా ఎక్కువ సౌకర్యాలతో కూడిన బిజినెస్ లేదా స్ట్రెచ్ క్లాస్ టికెట్లు రూ. 9999 నుంచి అందుబాటులో ఉన్నాయి.
అంతర్జాతీయ ప్రయాణాలకైతే ఎంపిక చేసిన రూట్లలో రూ. 4599 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి ప్రయాణికులు ఇండిగో అధికారిక వెబ్సైట్ goindigo.in ఇండిగో మొబైల్ యాప్, వాట్సాప్ లేదా స్కై చాట్బాట్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
ఇక ఇండిగో బ్లూచిప్ సభ్యుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఆఫర్ కాలంలో బ్లూచిప్ సభ్యులు అదనంగా డిస్కౌంట్ పొందగలరు. బ్లూ 1 సభ్యులకు 10శాతం తగ్గింపు, బ్లూ 2 సభ్యులకు 8శాతం తగ్గింపు, బ్లూ 3 సభ్యులకు 5శాతం తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ప్రయాణికులు IBC10 ప్రోమో కోడ్ ఉపయోగించాలి.
పండుగ సీజన్ దగ్గరపడుతున్న ఈ సమయంలో విమాన టికెట్ల ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇండిగో ఆఫర్ ప్రయాణికులకు నిజంగా ఊరట కలిగిస్తోంది. తక్కువ ధరలో ముందుగానే బుకింగ్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ టూర్స్ అన్నీ ఖర్చు తగ్గించుకుని పూర్తి చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.