)
How Much Gold Carry in Train: రైల్వేలు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో ఎక్కువమంది రైలు ప్రయాణానికి ఇష్టపడతారు. మీరు కూడా రైలు ప్రయాణిస్తూ.. మీతోపాటు బంగారం తీసుకువెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఎంత బంగారం తీసుకువెళ్లాలనే విషయం తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించి భారతీయ రైల్వేలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన నియమాలను రూపొందించాయి. రైల్వేలు బంగారాన్ని ప్రత్యేక వస్తువగా పరిగణించవు. బంగారాన్ని కూడా సాధారణ లగేజీ కిందే లెక్కిస్తారు. అంటే.. మీ టికెట్‌పై ఎంత లగేజీ అనుమతి ఉంటుందో అంతే బరువు బంగారాన్ని తీసుకువెళ్లవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. వివిధ తరగతుల ప్రయాణికులకు లగేజీ పరిమితులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు 70 కిలోల వరకు లగేజీని తమతోపాటు తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. అదేవిధంగా ఏసీ 2-టైర్ ప్రయాణికులు 50 కిలోల లగేజీ తీసుకువెళ్లవచ్చు. ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోల వరకు లగేజీకి అనుమతి ఉంది. జనరల్ క్లాస్ ప్రయాణికులకు 35 కేజీల లగేజీని అనుమతి ఇస్తారు. అంటే మీరు బంగారాన్ని తీసుకెళ్తుంటే.. ఈ పరిమితిలోపు ఉండాలి.
పరిమితికి మంచి లగేజీని మీతోపాటు తీసుకువెళ్తే.. అదనపు రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణించే ముందు మీకు అవసరమైన లగేజీ బరువును కచ్చితంగా అంచనా వేసుకోవాలి. అయితే ప్రస్తుతం రైల్వేల్లో లగేజీ బరువు విషయంలో నిబంధనలు అంతా పక్కగా అమలు కావడం లేదు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీ బరువును చెక్ చేసిన తరువాతనే పంపిస్తారు. అయితే రైల్వేల్లో ఇంకా అంత పక్కగా అమలు చేయడం లేదు. అయితే చెకింగ్ సమయంలో టీసీలు అధిక లగేజీని గమనిస్తే.. ఫైన్ వేసే అవకాశం ఉంటుంది.
మీరు రైలు ప్రయాణంలో బంగారు తీసుకువెళుతున్నట్లయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ నగలను చెక్ ఇన్ బ్యాగ్‌లో కాకుండా.. క్యారీ-ఆన్ బ్యాగ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. చెక్-ఇన్ బ్యాగ్‌లలో దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. అదే క్యారీ ఆన్ బ్యాగ్‌ను మీ చేతిలో ఉంచుకుని సురక్షితంగా తీసుకువెళ్లవచ్చు. ప్రయాణికుల భద్రత, లగేజీ భద్రతను నిర్ధారించడానికి రైల్వే శాఖ నిబంధనలు రూపొందించింది. రైలులో బంగారాన్ని తీసుకెళ్లడం పెద్ద కష్టం కాదు గానీ.. కాస్త రిస్క్ అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook