IT Returns 2023 Last Date: తమ ఆదాయ వ్యయాల గురించి ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉన్న ప్రతీ ఒక్కరూ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సిందే. అంతేకాకుండా కేవలం ప్రభుత్వానికి పన్ను చెల్లించడం అనే విషయమే కాకుండా ఐటి రిటర్న్స్ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో వారి ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుంది అనే విషయం కూడా మర్చిపోవద్దు. డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేయడం, ఐటి రిఫండ్ ప్రాసెస్ ఎంతో ఈజీ అయిపోయింది. ఎంతోమంది టాక్స్ బ్రోకర్స్ సైతం టాక్స్ కన్సల్టెంట్స్‌గా పని చేస్తూ టాక్స్ పేయర్స్‌కి, ఇన్‌కమ్ టాక్స్ విభాగానికి మధ్య వారిధిగా నిలుస్తున్నారు.
ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ఈ నెల 31 వరకు గడువు ఉంది. అంటే సరిగ్గా చెప్పాలంటే తుది గడువుకు మరో మూడు, నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నమాట. గడువు దగ్గరపడుతున్న కొద్దీ టాక్స్ పేయర్స్ అందరూ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు పోటీ పడుతుండటంతో కొన్నిసార్లు ఐటి సర్వర్స్ సైతం బిజీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ఎప్పుడైనా ముందే చేసుకోవడం ఉత్తమం.
ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికంటే ముందుగా మన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసి ఒక్కచోట పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపులు, టాక్స్ రిఫండ్స్‌కి సంబంధించిన లెక్కలు కూడా ముందే సిద్ధం చేసిపెట్టుకోవాలి. ఆదాయ పన్ను చట్టం, 1961 కింద పౌరులకు లభించే టాక్స్ ఎగ్జెంప్షన్స్, ఇతర డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత కలిగిన టాక్స్ పేయర్స్‌కి ఐటి రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత టాక్స్ డిడక్షన్ సోర్స్ లభిస్తుంది.
రీఫండ్ క్లెయిమ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే...
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్
వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు దాటిన వారు కొత్త పన్ను విధానంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని, అలాగే ఏదైనా రిఫండ్ రావాల్సి ఉంటే ఆ మొత్తాన్ని సూచించే అధికార పత్రం లాంటిదన్నామట. ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ప్రకారం ఒకవేళ మీరు చెల్లించిన టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ ద్వారా చెల్లించిన పన్ను మొత్తం మీ మొత్తం పన్ను లయబిలిటీని మించినట్టయితే, మీరు టాక్స్ రీఫండ్‌కు అర్హులు అవుతారు.
రిఫండ్ వేగంగా పొందడం ఎలా..
"ఐటి రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఐటి రిఫండ్ రావడానికి ఎంత సమయం పడుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐటి రిఫండ్ కోసం ప్రత్యేకించి ఒక నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఏమీ లేనప్పటికీ, సాధారణంగా రిఫండ్ కోసం ఫైల్ చేసిన తరువాత వారం రోజుల నుంచి ఆ తరువాతి 10 రోజులలోపు ఎప్పుడైనా ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ తుది గడువు సమీపించే సమయంలో మీరు ఐటి రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే, అప్పుడు రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక మీ ఐటి రిఫండ్ ప్రాసెసింగ్ అవడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు నమోదు చేసే సమాచారంలో ఎలాంటి అయోమయం లేకుండా ఎంత కచ్చితంగా ఉంటే.. సరైన సమాచారం లేని కారణంగా జరిగే జాప్యానికి తావు లేకుండా మీ రిఫండ్ కూడా అంతే త్వరగా ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. సమయం ఎక్కువగా లేదు. వీలైనంత త్వరగా ఐటి రిటర్న్స్ ఫైల్ చేసుకోండి.
ఇది కూడా చదవండి : Easy Tips To Save Money: డబ్బులను ఈజీగా పొదుపు చేసే మార్గాలు
ఐటి రిఫండ్ స్టేటస్ ట్రాక్ చేయండిలా
మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన అనంతరం ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన ఐటిరిటన్స్ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగాన్ అవడం ద్వారా మీ రీఫండ్ స్టేటస్ ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసే సమయంలో ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెబ్‌సైట్లో అడిగిన చోట ఎంటర్ చేయడం ద్వారా మీ రిఫండ్ స్టేటస్‌ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు.
ఇది కూడా చదవండి : Applying For Home Loan: హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నారా ? మీకు ఈ సమస్యల గురించి తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి