Japan Birth Rate Drop: జపాన్ త్వరలోనే అంతరించిపోనుందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి తాజా రిపోర్టులు. ఎందుకంటే జపాన్ లో యువశక్తి విషయంలో తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం వెల్లడించిన అధికారిక డేటా ప్రకారం 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది.
1950లో ప్రభుత్వం పోల్చదగిన డేటాను సేకరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇది రికార్డు స్థాయిలో అతిపెద్ద పతనం అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అయినా కూడా జపాన్ యువత పలు కారణాలతో పెళ్లి, పిల్లల విషయంలో మరింత ఆలస్యం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప బర్త్ రేట్ ను నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
మరోవిషయం ఏంటంటే పిల్లలు కావాలని కోరుకునే యువ కుటుంబాలకు ఆర్థికంగ సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చీఫ్ కేబినెట్ కార్యదర్శి యోషిమాసా హయాసి తెలిపారు. జపాన్ లో విదేశీయులు కూడా భారీగానే తగ్గుతున్నారు. జపాన్ యువ విదేశీయులకు తమ శ్రమ వనరుగా మార్చుకుంది. కానీ ప్రభుత్వం కఠినమైన వల విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో ప్రస్తుతం విదేశీ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే అక్కడికి అనుమతిస్తోంది. దీంతో ఆ దేశంలో విదేశీయుల జనాభా కూడా గణనీయంగా తగ్గినట్లుగా తాజాగా వెలువడిన డేటాతో స్పష్టం అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









