Success Story: 'హ్యాపీనెస్ ఈజ్ మై కీ'...జేఈఈ టాపర్ రజిత్ సక్సెస్ స్టోరీ వింటే.. వారెవ్వా గెలుపంటే ఇదే అనాల్సిందే

JEE Main Topper Rajit Gupta Success Story: నేటి సక్సెస్ స్టోరీలో JEE మెయిన్ 2025లో 100 పర్సంటైల్ సాధించిన IIT-JEE టాపర్ రజిత్ గుప్తాను కలుద్దాం. జేఈఈ రాసిన తర్వాత ఒక్కసారి కూడా కీ చూసుకోలేదు. ఫలితాల్లో వందకు వంద శాతం స్కోర్ చేసి టాపర్ గా నిలిచాడు. దీనంతటికి  హ్యాపీ నెస్ ఈజ్ మై కీ అంటున్నాడు. అసలు ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ చేసులేదంటున్న రజిత్ గుప్తా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 15, 2025, 11:37 PM IST
Success Story: 'హ్యాపీనెస్ ఈజ్ మై కీ'...జేఈఈ టాపర్ రజిత్ సక్సెస్ స్టోరీ వింటే.. వారెవ్వా గెలుపంటే ఇదే అనాల్సిందే

JEE Main Topper Rajit Gupta Success Story:  విజయం వరించాలంటే అంత సులభం కాదు. రంగం ఏదైనా సరే కష్టపడాల్సిందే. నూటికి నూరుశాతం కష్టపడితే విజయం దానంతట అదే వరిస్తుంది. అలాంటి ఎంతో మంది గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు JEE మెయిన్ 2025లో 100 పర్సంటైల్ సాధించిన IIT-JEE టాపర్ రజిత్ గుప్తా  గురించి తెలుసుకుందాం. రజిత్ సక్సెస్ మంత్ర వింటే మీ మనస్సు పులకరించిపోతుంది. ఇలా కూడా విజయాన్ని ఆస్వాదించగలమా అనే సందేహం మనలో మెదులుతుంది. విజయం వరించాలంటే ఒత్తిడి లోనవ్వడం కాదు..సంతోషాన్ని ఆస్వాదించడం. కష్టాన్ని నమ్ముకోవడం.

Add Zee News as a Preferred Source

ప్రతి సంవత్సరం JEE మెయిన్ పరీక్ష తర్వాత, టాపర్ల కథలు చాలా మంది బయటకు వస్తూనే ఉంటాయి. కానీ రజిత్ గుప్తా కథ ప్రత్యేకమైనది. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన తర్వాత, అతనికి తనపై ఎంత నమ్మకం వచ్చిందంటే, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఆన్సర్ కీని చూసుకోలేదు. తన విజయ రహస్యంగా, ప్రతి విద్యార్థి మెరుగైన పనితీరు కోసం తమ జీవితంలో స్వీకరించాల్సిన ఒక ప్రత్యేకమైన విజయ మంత్రాన్ని ఆయన పంచుకున్నారు. రజిత్ గుప్తా  అతని JEE పరీక్ష తయారీ ప్రయాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

2025 JEE-Main ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష సెషన్ 1లో రాజస్థాన్ నుండి 100 పర్సంటైల్ సాధించిన ఐదుగురు JEE మెయిన్ అభ్యర్థులలో నలుగురు కోటలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు. అలాంటి వారిలో ఒకరు రజిత్ గుప్తా. అతను JEE మెయిన్ పరీక్ష రాసిన వెంటనే తన ఫలితాన్ని తెలుసుకున్నాడు.జనవరి సెషన్‌లో జేఈఈ మెయిన్స్‌లో రజత్ గుప్తా 100 పర్సంటైల్ సాధించాడు. అతని విజయగాథ స్ఫూర్తిదాయకం. అతను తన విజయ రహస్యాన్ని కూడా పంచుకున్నాడు.జేఈఈ టాపర్ తన ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుతూ, 'మా నాన్న పరీక్ష రాసిన తర్వాత ఒకసారి ఆన్సర్ కీని చెక్ చేయమని అడిగారు. కానీ నేను, 'నాన్న ఎక్కువగా ఆలోచించకండి.. నేను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తాను అని ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో చెప్పాను. 'నా విజయానికి ఆనందమే కీలకం. నేను ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటాను. నేను చదువుల కోసం ఎప్పుడూ కఠినమైన షెడ్యూల్‌ను పాటించలేదు. ఎందుకంటే అది అనవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. కాబట్టి నాకు నచ్చినప్పుడు మాత్రమే చదువుకున్నాను. కానీ నేను ఎంత సమయం చదివినా బాగా చదువుకున్నాను అని తెలిపారు. 

Also Read: Swiggy Pyng App: స్విగ్గీ నుంచి సరికొత్త యాప్.. యూజర్ల కోసం ఏఐ ఆధారిత పింగ్.. దెబ్బకు దూసుకుపోయిన షేర్లు  

తన ప్రిపేరషన్ గురించి చెబుతూ..నేను తప్పులను పునరావృతం చేయకూడదనేది నా ప్రధాన దృష్టి. ఎందుకంటే తప్పులను తొలగించడం ద్వారా మాత్రమే, మీ సబ్జెక్టు పునాది బలంగా మారుతుందని తెలిపాడు.  ఫిబ్రవరి 2025లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో, దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు రాజస్థాన్ నుండి, అత్యధిక సంఖ్యలో బాలికలు JEE కోచింగ్ కేంద్రంగా పిలిచే కోట నగరం నుండి వచ్చారు.

Also Read: Business Ideas: వ్యాపారం పురుషుల సొత్తేం కాదని నిరూపించిన సూపర్ వుమెన్..ఉద్యోగం మానేసి.. రోజుకు రూ.3వేలు సంపాదన 

ఇక రజిత్ ప్రతిభ జేఈఈలోనే కాదు..టెన్త్ క్లాస్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో కూడా 97శాతం మార్కులు తెచ్చుకున్నాడు. సైన్స్ పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించాడు. ఇంటర్ లో మలేషియాలో జరిగిన ఆసియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. జూనియర్ సైన్స్, ఖగోళశాస్త్రం, భౌతిక శాస్త్రాలలో హెజ్బీసీఎస్ఈ ముంబైలో ఓరియంటేషన్ కమ్ సెక్షన్ క్యాప్ కు మూడు సార్లు సెలక్టయ్యాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న రజిత్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనుసరించడమే తన సక్సెస్ కు కారణమని చెబుతున్నాడు. 
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News