Jio Airfiber: వైఫై.. డాటా సేవలతోపాటు అత్యధికంగా వినోదం అందిస్తున్న జియోఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అత్యధికంగా అందుతున్నాయి. ఇతర వైఫైలకు అందని స్థాయిలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు ఉన్నాయి. జియో ఎయిర్‌ఫైబర్ 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని బలపరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్‌ను పొందింది.
జియో గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో జియో ఎయిర్‌ఫైబర్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లు 2025 జనవరిలో 4,27,439 ఉన్నారు. ఫిబ్రవరిలో 4,58,372 మంది సబ్‌స్క్రైబర్లు చేరారు. భారతీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉండడం గమనార్హం. 84 శాతం మార్కెట్ వాటా, అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో ఆధిపత్యం చలాయిస్తోంది. తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబర్ బేస్‌ను జియో ఎయిర్‌ఫైబర్ సంపాదించుకోవడం విశేషం.
5జీ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం.. అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం, సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడంతో జియో హవా కొనసాగించడానికి కారణాలుగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు, చిన్న వ్యాపారానికి, గృహ వినోదం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
జియో ఎయిర్ ఫైబర్ ఆఫర్లు.. సేవలు పరిశీలిస్తే 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్లు, 11కి పైగా ఓటీటీ యాప్‌లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సేవలు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో ప్రపంచ స్థాయి ఇంటి వినోదం జియో ఫైబర్ అందిస్తోంది. వివిధ వయస్సులు, నేపథ్యాల నుంచి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందుతున్నారు. డిజిటల్ ఇండియా ప్రయోజనాలను వినియోగదారులు అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









