Jio AirFiber Plan: జియో ఎయిర్ ఫైబర్ నుంచి భారీ శుభవార్త. ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే అతి తక్కువ ధరకే 12 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, 800 టీవీ ఛానెళ్లు ఉచితంగా అందుతాయి. జియో అందిస్తున్న ఈ అదిరిపోయే ప్లాన్ టారిఫ్ కేవలం 599 రూపాయలు మాత్రమే.
రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. జియో కొత్తగా లాంచ్ చేసిన జియో ఎయిర్ ఫైబర్ ప్యాకేజ్‌తో కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ టారిఫ్ నెలకు కేవలం 599 రూపాయలు మాత్రమే. ఈ ప్లాన్ తీసుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. 12 ఓటీటీ సేవలు ఉచితంగా అందుతాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుంటుంది. ఇదే ప్లాన్ 6 లేదా 12 నెలలకు కూడా తీసుకోవచ్చు. ఇందులో 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. నెలకు లెక్కేస్తే 1000 జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక ఓటీటీ సేవలు ఉచితంగా అందుతాయి.
ఈ ప్లాన్ తీసుకుంటే మొత్తం 12 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షెమారూ వంటి ఓటీటీ సేవలు లభిస్తాయి. ఈ 12 ఓటీటీలతో పాటు 8 వందలకు పైగా టీవీ చానెళ్లు వీక్షించవచ్చు. దీనికోసం సెటప్ బాక్స్ ఉచితంగా లభిస్తుంది.
ఇందులో 3 నెలల ప్లాన్ తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు 1000 రూపాలు చెల్లించాలి. అదే 6 నెలలకు తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీ 500 రూపాయలు, ఏడాదికి తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ పూర్తిగా ఉచితం. అంతేకాకుండా ఓ నెల అదనంగా లభిస్తుంది.
Also read: BSNL Recharge Plans: 797 రూపాయలకే 300 రోజుల వ్యాలిడిటీతో అత్యంత చౌక రీఛార్జ్ ప్లాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









