)
Jio Recharge Cheap Plan: ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. జియో చౌకైన రోజువారీ డేటాతో ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్‌ను నిలిపివేస్తూ వచ్చింది. ఈ వార్త జియో యూజర్లకు కలవరపెడుతుంది. ఇటీవలే జియో తమకు చెందిన రూ. 249 ప్లాన్ ను నిలిపేసింది. తాజాగా మరో చౌకైన ప్లాన్ ను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. అతితక్కువ ధరతో ఉన్న ఆ రీఛార్జ్ ప్లాన్ నిలిపేయగా యూజర్లు గందరగోళంలో ఉన్నారు.
జాతీయ వార్తా సంస్థలు నివేదిక ప్రకారం.. ఇటీవలే రూ.249 ప్లాన్ నిలిపేసిన తర్వాత.. జియో ఇప్పుడు రూ.209 ప్లాన్‌ను కూడా ఆపేసింది. 22 రోజుల చెల్లుబాటుతో వచ్చిన ఈ ప్లాన్ ప్రతిరోజూ 1 GB డేటాను అందించింది. అందువల్ల, వినియోగదారులు ఈ ప్లాన్‌లో మొత్తం 22 GB డేటాను పొందేవారు. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత SMSలు, దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ను కూడా అందించింది.
రూ.249 ప్లాన్ కూడా పోయే..
జియో మొదట రూ.249 ప్లాన్‌ను నిలిపివేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబీ చొప్పున 28 జీబీ వచ్చేది. దీంతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితంగా వస్తాయి. ఇటీవలే ఈ రీఛార్జ్ ప్లాన్‌ను జియో ఆపేసింది.
జియోలో ఇప్పుడు మిగిలున్న చౌకైన రీఛార్జ్ ప్లాన్స్..
రూ. 198 రీఛార్జ్ ప్లాన్..
ఇప్పుడు మీరు రూ.198కి రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు 14 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా రోజుకు 2 జీబీ డేటా, దేశంలోని అన్ని నెట్వర్క్స్కు అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లు వస్తాయి. దీంతో పాటు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
ఇప్పుడు బెస్ట్ ఆఫర్ రూ. 239 రీఛార్జ్ ప్లాన్..
ఇప్పుడున్న ఆఫర్లలో రూ. 239 రీఛార్జ్ ప్లాన్ ఉత్తమమైనదని జియో యూజర్లు అంటున్నారు. ఈ రీఛార్జ్ 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. వీటితో పాటు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook