Jio Fiber Plans: రిలయన్స్ జియో అటు టెలీకం, ఇటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో దూసుకువెళ్తోంది. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలీకం ప్రొవైడర్‌గా ఉన్న జియో పైబర్ వివిధ రకాల ఆకర్షణీయమైన పథకాలతో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సత్తా చాటుతోంది. మిలియన్ల కొద్దీ వినియోగదారులతో అతి పెద్ద ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
జియో ఫైబర్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఫైబర్ ప్లాన్స్‌తో ఓటీటీ ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. అతి తక్కువ ధరలో అంటే చీప్ అండ్ బెస్ట్ ఫైబర్ ప్లాన్స్‌తో ఉచితంగా ఓటీటీలు వీక్షించే అవకాశం ఇది. జియో ఫైబర్ 599 రూపాయల ప్యాకేజ్ ఇది. ఇందులో అన్‌లిమిటెడ్ వైఫై సౌకర్యం ఉంటుంది. దాంతోపాటు ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ పొందవచ్చు. మరో ప్లాన్ 399 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అయితే నెలకు 3.3 టీబీ డేటాను 30 ఎంబీపీఎస్ వేగంతో పొందవచ్చు. ఓటీటీ యాక్సెస్ మాత్రం ఉండదు. బ్రౌజింగ్, వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ తరగతులకు ఉపయోగం ఇది.
ఇక జియో 599 ఫైబర్ ప్లాన్‌లో 3.3 టీబీ డేటా 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో లభిస్తుంది. ఫైబర్ అందుబాటులో లేకుంటే జియో ఎయిర్ పైబర్ ద్వారా 5జీ స్పీడ్‌తో హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ సర్వీసులో 1టీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అంటే 599 రూపాయలకే ఇంటర్నెట్‌తో పాటు సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, డిస్కవరీ ప్లస్, ఎరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, షెమారూ మి, ఈటీవీ విన్, జియో హాట్‌స్టార్ ఉచితంగా స్ట్రీమింగ్ లభిస్తుంది.
ఈ ప్లాన్ 6 నెలలు లేదా 12 నెలల ప్యాకేజ్‌తో లభిస్తుంది. ఇలా తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఫీజులు ఉండవు. డివైస్ ఖర్చు కూడా కలిసొస్తుంది. ఈ రెండూ ఉచితంగా అందుకోవచ్చు. ఫాస్ట్ ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.
Also read: Women Free Bus: మహిళలకు గుడ్‌న్యూస్, ఉచిత బస్సు పధకం ఆ తేదీ నుంచే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









