Patanjali: పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తులు 'సాక్ష్యాధారిత ఔషధం'.. అంటే ఏమిటో తెలుసా?

Know About Patanjali How To Protect And Produce Of Ayurvedic Products: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్పత్తులు ఎలా సురక్షితం.. అంత ప్రభావంతంగా ఉండడానికి కారణాలు తెలుసా? అసలు సాక్ష్యాధారిత ఔషధం అంటే ఏమిటో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2025, 02:23 PM IST
Patanjali: పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తులు 'సాక్ష్యాధారిత ఔషధం'.. అంటే ఏమిటో తెలుసా?

Patanjali Ayurvedic Products: పతంజలి ఆయుర్వేదం తన అన్ని ఉత్పత్తుల సురక్షిత, ప్రభావవంతమైనవని నిర్ధారించడానికి స్వయంగా ల్యాబ్‌లో పరిశోధన చేస్తుంది. ఈ ల్యాబ్‌లలో కొత్త టెక్నాలజీ, ఆధునిక సౌకర్యాలు ఉపయోగిస్తారు. ఈ ల్యాబ్‌లను ఎన్‌ఏబీఎల్‌, డీఎస్‌ఐఆర్‌, డీబీటీ వంటి పెద్ద పరిశోధన సంస్థలు గుర్తించాయి. వాటి సహాయంతో పతంజలి ఆయుర్వేద ఔషధాలను శాస్త్రీయ విధానంలో అభివృద్ధి చేసి.. పరీక్షించి అవి మరింత ప్రభావవంతమైనవి, సురక్షితమైనవిగా నిర్ధారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Maruti Suzuki Ertiga: దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ పెద్ద కారు ఏదో తెలుసా?

పతంజలి ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌లలో ప్రతి ఉత్పత్తినీ మెరుగుపరచడానికి ప్రతి వైపు నుంచి పరిశోధన చేస్తారు. ఇక్కడ ఆయుర్వేదం పాత జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో జోడించి ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇప్పుడు పతంజలికి ఉత్పత్తులు ఎలా తయారయ్యి మార్కెట్‌లోకి వస్తాయో చూద్దాం.

పరిశోధన
పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ (PRF)ను 2017లో ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాన్ని కలిపే లక్ష్యంతో ప్రారంభించారు. వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో 300 మందికి పైగా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. హర్బల్, నేచరల్ ఔషధాల చికిత్స.. భద్రత ప్రయోజనాలను నిరూపించడంగా లక్ష్యంగా ఈ ఫౌండేషన్‌ పని చేస్తుంది. ఈ పరిశోధకులు పాత ఆయుర్వేద పుస్తకాలను చదివి వాటి జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంపై పరీక్షిస్తారు.

Also Read: Patanjali: సంపూర్ణ ఆరోగ్యానికి నమ్మకమైన బ్రాండ్ పతంజలి.. తరతరాలుగా భారీ డిమాండ్

పతంజలి ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌లలో వివిధ ప్రత్యేకత కలిగిన విభాగాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల పరిశోధనలు, పరీక్షలు జరుగుతున్నాయి.

ల్యాబ్‌లు ఇవే..
మైక్రోబయాలజీ ల్యాబ్

అనలిటికల్ రీసెర్చ్

పాథాలజీ ల్యాబ్

ఈ ల్యాబ్‌ల్లో బయోసేఫ్టీ క్లాస్-II ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి హై-స్పీడ్ సెంట్రిఫ్యూజ్, పీసీఆర్‌, యూవీ-వీఐఎస్‌ స్పెక్ట్రోఫోటోమీటర్, ఇతర హై-టెక్నాలజీతో సిద్ధం చేస్తారు.

నాణ్యత ప్రమాణాలు
పతంజలికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సర్టిఫికేషన్లు ఉన్నాయి. ఇవి వారి ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌లు నమ్మకమైనవి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపిస్తాయి. వీటిలో ఇవి ఉన్నాయి:

గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ సర్టిఫికెట్: ఇది ఉత్పత్తి ప్రక్రియలు క్వాలిటీ స్టాండర్ట్స్‌కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ): జీఎంపీ, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ సర్టిఫికేట్, ఇవి ఔషధ ఉత్పత్తుల భద్రత.. నాణ్యతకు అత్యంత అవసరమైనవి.

ల్యాబ్‌లో పరీక్షలు
పతంజలి ల్యాబ్‌లలో ప్రాణి పరీక్షలు, మానవ పరీక్షలు రెండూ జరుగుతాయి. దీని ద్వారా ఆయుర్వేదాన్ని "సాక్ష్యాధారిత ఔషధం"గా ప్రపంచానికి ప్రవేశపెడుతున్నారు. పతంజలి తన ఉత్పత్తుల భద్రత, ప్రభావాన్ని పరీక్షించడానికి మొదట ప్రాణులపై పరీక్ష చేస్తుంది. వారి ఇన్-వివో ల్యాబ్‌లను సీసీఎస్‌ఈఏ నుంచి అనుమతి పొందింది. ఇది అన్ని పరీక్షలు సరైన విధంగా జరుగుతున్నాయో లేదో చూస్తుంది. మొదట ఉత్పత్తులను ల్యాబ్‌లో పరీక్ష చేసి ఆపై అవి ఎలుకలు, నక్కలపై పరీక్షించబడతాయి. పరీక్ష ఫలితాలు సరైనవిగా ఉంటే, తరువాత మానవులపై పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా, ప్రతి ఉత్పత్తి మార్కెట్‌లో విడుదలయ్యే ముందు పూర్తిగా పరీక్షిస్తారు. ఈ కఠినమైన ప్రక్రియల ద్వారా, పతంజలి తన అన్ని ఉత్పత్తులూ సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి, ఉత్తమమైన నాణ్యత కలిగినవి అని నిర్ధారిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News