Gautam Adani case: అమెరికా లంచం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గౌతమ్ అదానీకి నోటీసు జారీ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్ కోర్టును ఆదేశించింది. దీంతో అదానీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లే. గౌతమ్ అదానీకి సమన్లను వీలైనంత త్వరగా అందజేయాలని, ఇది విదేశీ కోర్టుకు సంబంధించినది కాబట్టి వీలైనంత త్వరగా ఈ విషయాన్ని పరిష్కరించాలని మంత్రిత్వ శాఖ కోర్టును కోరింది.కాగా ఇదే అంశంపై ఫిబ్రవరి 25న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో అహ్మదాబాద్ కోర్టుకు ఒక లేఖ పంపింది. నివేదికలను విశ్వసిస్తే, కోర్టు నోటీసు పంపే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) గౌతమ్ అదానీ.. అతని మేనల్లుడు సాగర్ అదానీ వందల మిలియన్ల డాలర్ల లంచం పథకాన్ని నడుపుతున్నారని ఆరోపించింది. అధిక ధరలకు ఇంధన ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కాంలో పాత్ర పోషించినందుకు SEC అజూర్ పవర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సిరిల్ కాబేన్స్‌పై కూడా అభియోగాలు మోపింది.
Also Read: 7 Seater Car: కార్ల మార్కెట్‌కు కొత్త కళ.. వచ్చేనెల మార్కెట్లోకి 7 సీట్ల SUV.. ధర, ఫీచర్లు లీక్
న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం గౌతమ్ అదానీ నేత్రుత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, మారిషస్ కు చెందిన అజూరే పవర్ కంపెనీ సెకీతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు అజూరే పవర్ కంపెనీ 2023 వరకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదిత కంపెనీగా ఉంది. సెకీ నుంచి సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు దేశంలో ఏ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ ముందుకు రాలేదు. ఈ కారణంగానే రంగంలోకి దిగిన అదానీ లంచాలు ఇచ్చారనేది వాదన ఉంది. మొత్తం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిస్కమ్ లను ఆయన లంచాలు ఇచ్చి ఒప్పించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పేరుతో అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి పెద్దెత్తున నిధులు సేకరించింది. ఈ నిధుల నుంచే లంచాలు ఇచ్చినట్లు ఆరోపణ. ఈ ఆరోపించిన పథకం కింద, 2020 నుండి 2024 వరకు $250 మిలియన్ల (సుమారు రూ. 2236 కోట్లు) లంచాలు ఇచ్చారు. ఈ మొత్తం కేసులో, గౌతమ్ అదానీతో పాటు, సాగర్ అదానీ, వినీత్ జైన్ సహా 7 మందిపై అభియోగాలు మోపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









