Credit Card: భారత్ లో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్నే గూగుల్ పే పూర్తిగా మార్చేసింది. సాధారణంగా గూగుల్ పే డెబిట్ కార్డులకు లింక్ చేసి ఉంటుంది. కానీ మీకు రూపే కార్డు ఉంటే మీరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. డిజిటల్ చెల్లింపులను పెంచడంలో Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే, ఇప్పటివరకు చాలా మంది తమ డెబిట్ కార్డులను మాత్రమే ఈ చెల్లింపు యాప్‌లకు లింక్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు చాలా చెల్లింపు యాప్‌లు క్రెడిట్ కార్డులను జోడించే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. గూగుల్ పే ఇప్పుడు క్రెడిట్ కార్డుతో లింక్ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అయితే, దీని కోసం మీ దగ్గర RuPay క్రెడిట్ కార్డ్ ఉండాలి. రూపే క్రెడిట్ కార్డులు ఇప్పుడు అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డులను SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులతో పాటు అనేక ప్రాంతీయ, సహకార బ్యాంకులు జారీ చేస్తాయి.
మీకు RuPay క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు ఆఫ్‌లైన్ దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో Google Pay ద్వారా సురక్షితంగా, సులభంగా లావాదేవీలు చేయవచ్చు. మీ Google Payని మీ క్రెడిట్ కార్డ్‌తో ఎలా లింక్ చేయవచ్చో తెలుసుకుందాం.
రూపేని క్రెడిట్ కార్డ్‌ని గూగుల్ పేకి ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం:
UPI ట్రాన్సాక్షన్స్ కోసం మీ RuPay క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించేందుకు, మీరు ముందుగా మీ అధికారిక Gmail ID ద్వారా Google Payలో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీరు క్రింద ఇచ్చిన దశలను ఫాలో అవ్వండి.
-మీ మొబైల్ పరికరంలో Google Payని తెరవండి.
-తరువాత మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేసి 'చెల్లింపు పద్ధతులు' కు వెళ్ళండి.
-'యాడ్ రూపే క్రెడిట్ కార్డ్' ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ బ్యాంకును ఎంచుకుని, మీ కార్డు వివరాలను (CVV, నంబర్, గడువు తేదీ) నమోదు చేయండి.
-మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు పంపిన OTPని ఉపయోగించి కార్డ్‌ను ప్రామాణీకరించండి.
-సురక్షిత లావాదేవీలను ప్రారంభించడానికి UPI పిన్‌ను సెట్ చేయండి. ఇప్పుడు, మీరు మీ RuPay డెబిట్ క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు QR కోడ్, UPI ID లేదా వ్యాపారి హ్యాండిల్ ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు.
Also Read: Trump Tariffs: హమ్మయ్య.. ట్రంప్ వెనక్కి తగ్గాడు..సుంకాలు తగ్గించాడు.. దేనికంటే?
రుసుము చెల్లించాల్సి ఉంటుంది:
బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన UPI లావాదేవీలు ఉచితం. కానీ Google Pay, RuPayతో సహా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్లు చెల్లింపు ఛార్జీలు వసూలు చేస్తుంది. దేశంలో UPI లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయిలో రూ 24.77 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరితో పోలిస్తే 12.7% వృద్ధిని నమోదు చేశాయి. ఇంకా, ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం విలువలో 25% పెరుగుదల, పరిమాణంలో సుమారు 35% పెరుగుదలను సూచిస్తుంది.
Also Read: Mahindra: బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా అంకుల్.. ఆ మోడల్ కార్లపై 4లక్షల భారీ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









