)
LIC Golden Jubilee Scholarship Scheme 2025: ఉన్నత విద్య చదవాలని ఆశ ఉన్నా, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి.. ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ ద్వారా రూ.40 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు లేదా యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు.. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేయవచ్చు. మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు చదువుతున్న వారు కూడా అర్హులే. దరఖాస్తు చేయడానికి ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ www.licindia.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ స్కాలర్షిప్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జనరల్ స్కాలర్షిప్, ఇది అందరికీ వర్తిస్తుంది. రెండోది అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఉంది. టెక్నికల్, వొకేషనల్ కోర్సులు, ఎన్‌సివిటి గుర్తించిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివే వారు.. ఇంటర్ తర్వాత సంయుక్త కోర్సులు చేసేవారు కూడా ఈ స్కాలర్షిప్కు అర్హులు.
అర్హతలు ఏంటంటే..
1. జనరల్ స్కాలర్షిప్ (12వ తరగతి తర్వాత)..
విద్యార్హత: 2022-23, 2023-24 లేదా 2024-25 విద్యా సంవత్సరంలో 12వ తరగతి లేదా డిప్లొమాలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కోర్సులు: మెడిసిన్ (MBBS, BAMS, BHMS, BDS), ఇంజనీరింగ్ (BE, BTech, BArch), డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు, ఐటీఐ లేదా సమానమైన కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ఆదాయ పరిమితి: తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
2. జనరల్ స్కాలర్షిప్ (10వ తరగతి తర్వాత)..
విద్యార్హత: 2022-23, 2023-24, లేదా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కోర్సులు: వొకేషనల్ కోర్సులు, డిప్లొమా, ఐటీఐ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ఆదాయ పరిమితి: తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
3. ప్రత్యేకంగా అమ్మాయిలకు సంబందించిన స్కాలర్షిప్ కోసం (స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్)..
విద్యార్హత: 2022-23, 2023-24 లేదా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కోర్సులు: 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (10+2), వొకేషనల్ కోర్సులు, డిప్లొమా, ఐటీఐ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ఆదాయ పరిమితి: తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు.
స్కాలర్షిప్ మొత్తం ఎంతంటే..
మెడిసిన్ కోర్సులు: సంవత్సరానికి రూ.40,000 (రెండు విడతల్లో రూ.20,000 చొప్పున).
ఇంజనీరింగ్ కోర్సులు: సంవత్సరానికి రూ.30,000 (రెండు విడతల్లో రూ.15,000 చొప్పున).
ఇతర కోర్సులు (డిగ్రీ, డిప్లొమా, వొకేషనల్, ఐటీఐ): సంవత్సరానికి రూ.20,000 (రెండు విడతల్లో రూ.10,000 చొప్పున).
ప్రత్యేక అమ్మాయిల స్కాలర్షిప్: సంవత్సరానికి రూ.15,000 (రెండు విడతల్లో రూ.7,500 చొప్పున).
దరఖాస్తు ప్రక్రియ..
1. అధికారిక వెబ్సైట్ [www.licindia.in](http://www.licindia.in)ని వెళ్లండి.
2. హోమ్‌పేజీలో “LIC Golden Jubilee Scholarship 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
3. “Apply Here for Scholarship Scheme 2025” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. అవసరమైన వివరాలతో అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండి (పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మార్కుల మెమో, ఆదాయ ధృవీకరణ పత్రం వంటివి అప్లోడ్ చేయాలి).
5. ఫామ్‌ను మరోసారి చెక్ చేసుకొని.. “సబ్మిట్” బటన్‌పై క్లిక్ చేయండి.
6. దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ నెంబర్‌ను భద్రపరచుకోండి.
గడువు..
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2025
అవసరమైన డాక్యుమెంట్లు..
* ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.
* 10వ లేదా 12వ తరగతి మార్కుల మెమో.
* ఆదాయ ధృవీకరణ పత్రం (తల్లిదండ్రులు/సంరక్షకులది)
* కోర్సు అడ్మిషన్ రుజువు.
* బ్యాంకు అకౌంట్ వివరాలు.
ముఖ్య గమనికలు..
* ఈ స్కాలర్షిప్ ఆర్థికంగా వెనుకబడిన (EWS) విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
* పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు.
* ఎల్ఐసీ యొక్క 112 డివిజనల్ ఆఫీసుల ద్వారా ప్రతి ఆఫీసు నుండి 100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు (80 జనరల్ స్కాలర్షిప్లు, 20 ప్రత్యేక అమ్మాయిల స్కాలర్షిప్లు).
* దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook