Sanjay Malhotra: విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను సవరించింది ఆర్బిఐ. రెపోరేటును 0.25శాతం మేర తగ్గింది గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన ఆయనకు..భవిష్యత్తులో రేట్ల కోతపై ఓ ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు.
గత ఏడాది చివరిలోనే సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా రెండుసార్లు వడ్డీరేట్లకోతను ప్రకటించారు. దీంతో రాబోయే నెలల్లో మరిన్ని తగ్గింపులు ఉండొచ్చా అని మీడియా అతన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరుకునేందుకు మానిటరీ పాలసీ, ఆర్థిక కమిటీ సమిష్టిగా పనిచేస్తున్నాయి. ఇటీవల కేంద్రం కూడా బడ్జెట్లోనూ ఇందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది.
మూలధన వ్యయాన్ని పెంచడం, పన్ను రిబేట్లు వంటివి కల్పించింది. ఇప్పుడు మేము కూడా రెపోరేటును తగ్గించాము. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందని నేను కూడా చెప్పలేము. ఎందుకంటే నేను కేవలం సంజయ్ ని మాత్రమే..మహాభారతంలో సంజయుడిని కాదు కదా..ఆయనలా భవిష్యత్తును చూడగలిగే దివ్యద్రుష్టి నాకు లేదు అని అన్నారు.
పురాణాల ప్రకారం..మహాభారతంలో సంజయుడు కౌరవుల రాయబారిగా ఉన్నాడు. కురక్షేత్రయుద్ధం సమయంలో కౌరవరాజు ధ్రుతరాష్ట్రుడి వద్దే ఉంటూ..తన దివ్యద్రుష్టితో యుద్ధభూమిలో ఏం జరుగుతుందో వివరించాడు. కురుక్షేత్రంలో క్రుష్ణ పరమాత్ముడు ప్రవచించిన భగవద్గీతను భగవానుడు ఆయన సన్నిహితుడైన సంజయునికి దివ్యద్రుష్టిని ఇచ్చాడు. సంజయునికి ధర్మనిరతునిగా పేరుంది.
Also Read: Gold Rate: పసిడిప్రియులు ఎగిరి గంతేసే వార్త.. ఏకంగా రూ. 4000లకు పడిపోయిన బంగారం ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









