Mahindra: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. రూ. 4లక్షల వరకు డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మహీంద్రా కంపెనీ తన పాత స్టాక్ ను క్లియర్ చేయడంలో బిజీగా ఉంది. డీలర్ల వద్ద ఇంకా 2024 మోడళ్ల స్టాక్ ఉంది. వీటిని క్లియర్ చేయడానికి కంపెనీ రూ. 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. పాత స్టాక్‌తో మీకు ఎలాంటి సమస్య లేకపోతే, భారీ తగ్గింపుతో మహీంద్రా కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు.
డీలర్లు ప్రస్తుతం XUV 3XO (2024) డీజిల్ మాన్యువల్ వేరియంట్లైన MX3, MX3 Pro, AX5 లపై రూ. 70,000 తగ్గింపును అందిస్తున్నారు. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 40,000-60,000 వరకు తగ్గింపు లభిస్తోంది. 2025 మోడల్‌పై మాత్రమే రూ. 50,000 వరకు తగ్గింపు ఇస్తోంది.
మీరు మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV మిగిలిన 2024 స్టాక్‌పై అత్యధిక తగ్గింపును పొందుతారు. ఈ కారు EL ప్రో ఫాస్ట్-ఛార్జ్ వేరియంట్‌పై రూ. 4 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తుంది. 2025 మోడల్‌పై రూ. 2.5 లక్షలు ఆదా చేసుకునే అవకాశం ఇస్తోంది. దీనితో పాటు, మహీంద్రా బొలెరో టాప్-ఎండ్ B6 ఆప్ట్ వేరియంట్ 2024 స్టాక్‌పై రూ. 1.05 లక్షల వరకు తగ్గింపు ఉంది. ఇది కాకుండా, మీరు బొలెరో నియో N10 పై రూ. 1.15 లక్షల ప్రయోజనాన్ని పొందవచ్చు.
Also Read: Gold Rate Today: లక్షకు నాలుగు అడుగుల దూరంలో తులం బంగారం ధర.. భవిష్యత్తులో గ్రాము కూడా కొనలేమా..?
మరోవైపు, మహీంద్రా XUV700 (2024) AX7 7S/AX7 L వేరియంట్‌లపై ఈ నెలలో రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తుండగా, మహీంద్రా స్కార్పియో-N (2024) Z4, Z6 వేరియంట్‌లపై రూ. 85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (2024) S వేరియంట్‌ను కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీకు రూ. 75,000 ఆదా చేసే అవకాశం ఉంది. మీరు మహీంద్రా థార్ 4WD పెట్రోల్/డీజిల్ (2024) 3-డోర్ వేరియంట్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









