)
Maruti Suzuki Car Price Cut: ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరల్లో కోత విధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో దాని ప్రయోజనం నేరుగా ప్రజలకు లభిస్తోంది. ముఖ్యంగా వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల కంపెనీలు ధరలు తగ్గించాయి. తాజాగా మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ధరలు తగ్గించింది. జీఎస్టీ ధరల తగ్గింపును నేరుగా వినియోగదారులకు ప్రయోజనం అందించనుంది. ఒక్కో కారు ధర రూ.లక్షన్నర వరకు తగ్గినట్లు తెలుస్తోంది.
మారుతీ సుజుకీ తన వాహనాలపై అత్యధికంగా రూ.1,29,600 వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు 22 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తాయని మారుతీ సుజుకీ తెలిపింది. జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రాథమిక స్థాయి కార్లపై మారుతీ సుజుకీ గణనీయమైన తగ్గింపును ఇస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వెల్లడించారు.
బైక్ వినియోగదారులు సులభంగా కార్లకు అప్‌గ్రేడ్ కావాలన్నదే తమ లక్ష్యమని పార్థో బెనర్జీ తెలిపారు. సర్వీస్, మెయింటెనెన్స్‌లో ఉపయోగించే కారు విడిభాగాలపై కూడా జీఎస్టీ రేటు తగ్గిస్తామని.. వినియోగదారులకు కూడా అందిస్తామని వెలల్డించారు.
ఎంట్రీ-లెవెల్ మోడల్ ధరలు ఇలా
ఎస్ ప్రెస్సో- రూ.1,29,600 వరకు
ఆల్టో కే10 - రూ.1,07,600 వరకు
సెలెరియో - రూ.94,100 వరకు
వ్యాగనార్- రూ.79,600 వరకు
స్విఫ్ట్ - రూ.84,600 వరకు
బాలెనో - రూ.86,100 వరకు
డిజైర్ - రూ.87,700 వరకు
బ్రెజా - రూ.1,12,700 వరకు
గ్రాండ్ విటారా - రూ.1.07 లక్ష వరకు
ఎర్టిగా - రూ.46,400 వరకు
తక్కువ తగ్గింపు ఇవే!
ఇన్విక్టో - రూ.61,700 వరకు
ఈకో - రూ.68,000 వరకు
సూపర్ క్యారీ ఎల్సీవీ- రూ.52,100
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook